Raashi Khanna: వరుస సినిమాలతో అదరగొడుతున్న రాశీఖన్నా!
టాలీవుడ్ లో అందాల బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) గురించి తెలియని వారుండరు. 'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా.. జయాపజయాలకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందర్నీ అలరిస్తూ వస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో… రాశీ ఖన్నా (Raashi Khanna) కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా రాశీ ఖన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది. తాను చేసే సినిమాల్లో కొత్త దనం ఉండేలా చూసుకుంటోంది.
ఇక ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు అయితే, అస్సలుకే అడ్డు చెప్పడం లేదు. అయినా ఈ బ్యూటీకి మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం ఇంకా రాలేదు. కొందరు హీరోయిన్లయితే.. తాము చేసిన ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటున్న తరుణంలో ఈ భామ మాత్రం ఆ హోదాకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కెరీర్ ప్రారంభం నుంచే గ్లామర్ మీద ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ప్రస్తుత తరం హీరోయిన్లకు ఫిజిక్ చాలా ముఖ్యం. ఈ విషయం చాలా మంది ముద్దుగుమ్మలకు అర్థమయే ఉంటుంది. అందుకే అందాల తారలంతా సమయం దొరికితే చాలు జిమ్స్ లో వర్కౌట్లు చేస్తూ గడిపేస్తుంటారు. ఇందుకు రాశీఖన్నా (Raashi Khanna) కూడా మినహాయింపు కాదు.
ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా (Raashi Khanna) కి ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ అన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె గంటల తరబడి జిమ్ లో చెమటోడుస్తూ కష్ట పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీంతో తాజాగా ఈ భామ జిమ్ చేశాక బయటికి వస్తూ మీడియా కంటికి వచ్చింది. దీంతో కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఇక రాశీ ఖన్నా సినిమాల విషయానికొస్తే తెలుగులో గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న 'పక్కా కమర్షియల్', నాగచైతన్యతో 'థ్యాంక్యూ' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళ్ లో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా రెండు వెబ్ సిరీస్ లను కూడా చేయబోతుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని చిత్రాలు కూడా రాశీ ఖన్నా (Raashi Khanna) ఒప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సినిమాల కథా చర్చలు జరుగుతున్నాయి.