నాగచైతన్య (Naga Chaitanya) ‘థ్యాంక్యూ’ సినిమా విడుదల తేదీలో మార్పు.. వెల్లడించిన చిత్ర యూనిట్

Updated on Jun 24, 2022 11:08 PM IST
డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, అక్కినేని నాగ చైతన్య
డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, అక్కినేని నాగ చైతన్య

జోష్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాగచైతన్య (Naga Chaitanya) అదే జోష్‌తో ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకున్నాడు. ఏ మాయ చేశావే, మనం, 100% లవ్, లవ్‌స్టోరీ, బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, ఒక లైలా కోసం, ప్రేమమ్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించాడు. తాజాగా నాగచైతన్య నటించిన కొత్త సినిమా ‘థ్యాంక్యూ’.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలుగా థ్యాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్యకు ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికాగోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా.. రెండు పాటలు ‘మారో..’, ‘ఏంటో ఏంటేంటో…’ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

నాగచైతన్య థ్యాంక్యూ సినిమా పోస్టర్

టీజర్.. పాటలకు మంచి రెస్పాన్స్..

టీజర్‌‌తోపాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో థ్యాంక్యూ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్‌ను మార్చింది. జూలై 22వ తేదీన థ్యాంక్యూ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కథను బీవీఎస్ రవి రచించారు. థ్యాంక్యూ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) ఫ్రెష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు.

Read More : లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను.. థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!