Naga Chaitanya (నాగ చైతన్య) : యూత్ సత్తాని చాటి చెప్పిన .. 'థాంక్యూ' సినిమాలోని 'మారో మారో' సాంగ్ !
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో (Naga Chaitanya) పక్కా యూత్‌ఫుల్ ఫిలిమ్‌గా 'థాంక్యూ' (Thank You) సినిమా తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ విక్రమ్. కె. కుమార్ (Vikram K Kumar) ఈ 'థాంక్యూ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా 'థాంక్యూ' సినిమా తెరకెక్కుతోంది. రాశిఖన్నా, అవికాగోర్,మాళవిక నాయర్‌లు కథానాయికలుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే 'థాంక్యూ' సినిమా నుంచి 'మారో... మారో'.. అనే లిరిక్స్‌తో ఓ యూత్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విశ్వ, కిట్టు విస్సాప్రగడ ఈ పాటను సంయుక్తంగా వ్రాయగా.. దీపు, పృథ్వీ చంద్ర, మహా ఈ పాటను ఆలపించారు.
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా అక్కినేని నాగచైతన్య చిత్రం
ఇక్కడ ఒకరంటే ఒకరికి పడదు..
గ్యాంగ్.. గ్యాంగ్.. ఒంటి నిండా పొగరు...మారో... మారో..
అనే లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్.. నేటి యువత మనోగతానికి అద్దం పడుతుంది. హాకీ టీమ్ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఈ పాటలో హీరో తండ్రి తనకు 'ఆల్ ది బెస్ట్' అని రాసిచ్చిన బ్యాట్‌ను.. మరో హాకీ ప్లేయర్ ముక్కలు ముక్కలు చేస్తాడు. తన తండ్రి కానుకగా ఇచ్చిన బ్యాట్‌ను విరిచేసిన, ఆ ప్లేయర్‌ను నాగ చైతన్య (Naga Chaitanya) ఓ రేంజ్‌లో కుమ్ముతాడు. అంటే ఈ చిత్రంలో నాన్నపై ఎమోషనల్ సీన్స్ ఉన్నాయనిపిస్తుంది.
అలాగే కాలేజీలో యూత్ మధ్య జరిగే గొడవలను కూడా ఈ పాటలో చూపించారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. బి.వి.ఎస్. రవి కథతో 'థాంక్యూ' సినిమా తెరకెక్కుతోంది.
మూడు వైవిధ్యమైన పాత్రలలో చై యాక్టింగ్
'మనం' తర్వాత విక్రమ్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సైన్ చేసిన సినిమా 'థాంక్యూ'. ఈ సినిమాలో నాగచైతన్య మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మూడు తరాల పాత్రలను నాగచైతన్య ఈ సినిమాలో తనదైన శైలిలో పోషించబోతున్నాడు . టీనేజ్ అబ్బాయి, యువకుడు, మధ్య వయస్కుడిగా మూడు పాత్రలలో చైతన్య నటిస్తున్నారు.
కొత్తదనం కోసం నాగ చైతన్య 'థాంక్యూ' సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహకుడుగా వ్యవహరిస్తున్నారు. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాల సక్సెస్ తర్వాత 'థాంక్యూ' మూవీతో మరో బ్లాక్ బాస్టర్‌తో హ్యాట్రిక్ కొట్టాలని చై అనుకుంటున్నారు. విక్రమ్ దర్శకత్వంలో చైతన్య (Naga Chaitanya) 'ధూత' అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. 'థాంక్యూ' సినిమా జూన్ 8న రిలీజ్ కానుంది.
Read More: సరికొత్త పాత్రలతో.. ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన చై !