నాగ చైత‌న్య (Naga Chaitanya) థాంక్యూ సినిమాలో ల‌వ్ సాంగ్ రిలీజ్.. ఓటీటీలో సినిమా రిలీజ్ నిజ‌మేనా?

Updated on Jun 16, 2022 07:08 PM IST
నాగ చైత‌న్య  (Naga Chaitanya) థాంక్యూ సినిమా నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్ రిలీజ్ చేశారు.
నాగ చైత‌న్య (Naga Chaitanya) థాంక్యూ సినిమా నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్‌లో నాగ చైత‌న్య (Naga Chaitanya) ఫుల్ జోష్ మీద ఉన్నారు. నాగ చైత‌న్య ప్ర‌స్తుతం థాంక్యూ సినిమాలో న‌టిస్తున్నారు. థాంక్యూ సినిమా నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్ రిలీజ్ చేశారు. నాగ‌చైత‌న్య‌, మాళ‌విక న‌య్య‌ర్ మ‌ధ్య ఈ పాట చిత్రీక‌రించారు. 1990 సంవ‌త్స‌రంలో నాగ‌చైత‌న్య కాలేజ్ డేస్ ల‌వ్ స్టోరిపై ఈ పాట సాగింది. అనంత శ్రీరామ్ మంచి లిరిక్స్ అందించారు. ఏంటో.. ఏంటేంటో.. పాట‌ను జోనిత గాంధీ పాడారు. త‌మ‌న్ అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

విక్రమ్ కె కుమార్ (Vikram K kumar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా రొమాంటిక్ సినిమాగా తెర‌కెక్కుతుంది. నాగ చైత‌న్య (Naga Chaitanya) మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలోరాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ప‌నిచేశారు. శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు థాంక్యూ చిత్రాన్ని నిర్మించారు

థాంక్యూ సినిమా జూలై రెండో వారంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా విడుద‌ల ఓటీటీలో అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. నిర్మాత దిల్ రాజు థాంక్యూ సినిమాను ఓటీటీలో రిలిజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. నాగ చైత‌న్య సినిమా థియేట‌ర్ల‌లోనా.. ఓటీటీలోనా అనేది సస్పెన్స్ కొన‌సాగుతుంది. మ‌రి దిల్ రాజు ఎలాంటి నిర్ష‌యం తీసుకుంటారో చూడాలి.

ఓటీటీలో థాంక్యూ సినిమా రిలీజా!
థాంక్యూ సినిమా జూలై 8 న థియేట‌ర్ల‌లో వారంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా విడుద‌ల ఓటీటీలో అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. నిర్మాత దిల్ రాజు థాంక్యూ సినిమాను ఓటీటీలో రిలిజ్ చేయాల‌నుకుంటున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ టాక్‌పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఓటీటీ ప్ర‌చారంపై నాగ చైత‌న్య అభిమానుల్లో అయోమ‌యం నెల‌కొంది. థాంక్యూ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నారు. కొంద‌రు ఓటీటీలో అంటూ నెగ‌టీవ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు చై ఫ్యాన్స్(Naga Chaitanya). 

Read More: Thank you (థాంక్యూ): సరికొత్త పాత్రలతో.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అయిన చై !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!