Naga Shaurya: ఘనంగా యంగ్‌ హీరో నాగశౌర్య వివాహం.. పిక్స్‌, వీడియో వైరల్

Updated on Nov 20, 2022 01:47 PM IST
యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shaurya) బెంగళూరుకు చెందిన అనుష్కశెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్‌‌ను పెళ్లి చేసుకున్నారు
యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shaurya) బెంగళూరుకు చెందిన అనుష్కశెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్‌‌ను పెళ్లి చేసుకున్నారు

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya). 'క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య.. ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోగా బ్రేక్ అందుకున్నారు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు శౌర్య. 'దిక్కులు చూడకు రామయ్య' 'ఓ బేబీ' 'ఛలో' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ యంగ్‌ హీరో పెళ్లి చేసుకున్నారు.  

బెంగళూరులో ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఒక ఇంటివాడు అయ్యారు నాగ శౌర్య. బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనూష అనే యువతితో నాగశౌర్య వివాహం జరిగింది.  వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగశౌర్య వివాహం చేసుకున్న అమ్మాయి పేరు అనూష షెట్టి. ఈమె ఒక ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. 2020లో ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో అనూష ఒకరు. విమెన్ అచీవర్స్‌గా కూడా గుర్తింపు పొందారు. తన టాలెంట్‌తో బెంగుళూరులోనే హయ్యెస్ట్ పెయిడ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు అనూష.  2019లో ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు.

నాగశౌర్య (Naga Shaurya) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. సినిమా షూటింగ్‌ జరుగుతుండగా స్పృహ కోల్పోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా కోలుకున్నారు.

Read More : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!