Like, Share & Subscribe : ఈ కొత్త తెలుగు సినిమా గురించి టాప్ 10 విశేషాలు
Like, , Share & Subscribe ... వినడానికి కొత్త పేరులా ఉంది కదా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ పదాలు కొత్తేమీ కాదు. కానీ ఇదే పేరుతో దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. కాదండీ బాబు .. ఇది నిజం ! ఈ సినిమా గురించిన టాప్ టెన్ విశేషాలు మీకోసం
దర్శకుడు మామూలోడు కాదండీ బాబూ
మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన తండ్రి మేర్లపాక మురళి గొప్ప నవలా రచయిత. అంతేకాదు.. గాంధీ లిస్టులో ఇప్పటికే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి.
ఇక నానితో ఈయన తెరకెక్కించిన 'కృష్ణార్జున యుద్ధం' పెద్ద సక్సెస్ కానప్పటికీ దర్శకుడికి మాత్రం మంచి పేరే వచ్చింది. అలాగే మేస్ట్రో, ఏక్ మినీ కథ లాంటి సినిమాలకు కూడా గాంధీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈయన మెగాఫోన్ నుండి వస్తున్న మరో చిత్రమే ఈ 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'.
హీరోగా సంతోష్ శోభన్ (Santosh Shobhan)
'గోల్కోండ్ హై' స్కూల్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై తను నేను, పేపర్ బాయ్, ఏక్ మినీ కథ లాంటి సినిమాలలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నారట.
'జాతి రత్నాలు' కథానాయికతో (Fariah Abdullah)
జాతి రత్నాలు సినిమాతో దుమ్మురేపిన పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుందట. ఇంకేముంది.. ఈమె కామెడీ టైమింగ్‌కు కూడా పెట్టింది పేరు. కనుక ఈ పాత్ర చిత్రానికి కచ్చితంగా హైలెట్‌గా నిలుస్తుందని భావించవచ్చు.
శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్లు
శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలే, ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి ప్రొడక్షన్‌లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది.
ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్
'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాకు సంగీతం అందించిన ప్రవీణ్ లక్కరాజే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారట. కనుక మేర్లపాక గాంధీ తను గతంలో పనిచేసిన టీమ్ సభ్యులతోనే మాగ్జిమమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అనుకోవచ్చు. అలాగే రామ్ మిరియాల కూడా ఈ సినిమాకి మరో సంగీత దర్శకుడు.
ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్లా
హిట్, మేజర్, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసిన అవినాష్ కొల్లా, ఈ 'Like, Share & Subscribe' కి కూడా పనిచేస్తున్నారు.
అవార్డు విన్నింగ్ కెమెరామ్యాన్‌తో
"అవేకనింగ్స్" అనే షార్ట్ ఫిల్మ్‌తో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు పొందిన బెస్ట్ కెమెరామ్యాన్ ఏ.వసంత్ ఈ సినిమాకి కూడా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వసంత్ గతంలో 'ఆకాశవాణి' అనే బాలీవుడ్ చిత్రానికి పనిచేశారు. ప్రస్తుతం తెలుగులో 18 పేజీస్ చిత్రానికి కూడా వర్క్ చేస్తున్నారు.
వైవిధ్యంగా సాగిన యూట్యూబ్ ప్రమోషన్
ఈ సినిమా కోసం యూట్యూబ్ ప్రమోషన్‌ను వైవిధ్యంగా చేశారు. హీరోతో ఫన్ జనరేట్ చేస్తూ, అతనికి మార్గదర్శిగా నటుడు బ్రహ్మాజీని పేర్కొంటూ చేసిన వీడియో చాలా వినోదాత్మకంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌ను ఎంత కొత్తగా చేస్తారన్న కోణంలో ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో నటుడు సుదర్శన్ కూడా ఉంటారు.
ఇతర పాత్రలలో వీరే
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా పెయిర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో, సుదర్శన్, నరేన్, మైమ్ గోపీ, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి, బబ్లూ, మిర్చి కిరణ్, ఫణి ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
మిగతా టీమ్ సభ్యులు
నీరజా కోన ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనరుగా వ్యవహరిస్తుండగా, రామ్ తూము ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక భాను మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
ఇవండీ.. Like, Share & Subscribe సినిమా సంగతులు
Read More : Faria Abdullah: డ్యాన్స్ ఇరగదీసిన 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా..!