Agent Anand Santosh Teaser: 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌'గా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్!

Updated on Jul 12, 2022 04:06 PM IST
'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' పోస్టర్, షణ్ముఖ్ జశ్వంత్ (Agent Anand Santosh Poster, Shanmukh Jaswanth)
'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' పోస్టర్, షణ్ముఖ్ జశ్వంత్ (Agent Anand Santosh Poster, Shanmukh Jaswanth)

Shanmukh Jaswanth: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఫేమస్ యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తెలుగులోనే అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించాడు షన్ను. 

షణ్ముఖ్ జశ్వంత్.. తన మాజీ ప్రేయసి దీప్తి సునైనా వల్ల మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో బిగ్ బాస్ షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌, బ్రేకప్‌ తర్వాత తన కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఈ క్రమంలోనే 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' (Agent Anand Santosh) వెబ్ సిరీస్‌ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.  

కామెడీ నేపథ్యంలో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా “AAS” తెరకెక్కినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. 'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్‌? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్‌ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. కొద్దిగా అమాయకంగా కూర్చుని.. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్. మనుషులు పోయినా లేదా సామాన్లు పోయినా వెతికి పెడతా.. అంటూ షణ్ముఖ్ టీజర్ (Agent Anand Santosh Teaser) లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

అయితే, బిగ్ బాస్ (Telugu Biggboss) నుంచి బయటకు వచ్చాక.. షన్ను ఎప్పుడెప్పుడు సినిమాను అనౌన్స్ చేస్తాడా? అని అందరూ ఎదురుచూశారు. అయితే యూట్యూబ్ కోసం వెబ్ సిరీస్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ షన్ను ఇలా ఆహా కోసం వెబ్ సిరీస్ చేశాడు. 'సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్', 'సూర్య' వెబ్ సిరీస్‌ల తరువాత మళ్లీ షన్ను, సుబ్బు కలిసి ఈ ఏజెంట్‌ను తెరకెక్కించారు. 

మొత్తానికి ఆహాలో రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ మాత్రం అందరినీ కట్టి పడేసేలా ఉందనిపిస్తోంది. షన్ను కామెడీ టైమింగ్ ఇందులో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ (Agent Anand Santosh Webseries) అందరి ముందుకు రాబోతోంది. షణ్ముఖ్ ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read More: Shanmukh Jaswanth: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'గా రాబోతున్న షణ్ముఖ్ జస్వంత్.. అదరగొడుతున్న ఫస్ట్ లుక్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!