Faria Abdullah: మరో ఐటెం సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?

Updated on Jul 10, 2022 07:22 PM IST
అఖిల్‌ అక్కినేని ఏజెంట్‌ సినిమా పోస్టర్, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)
అఖిల్‌ అక్కినేని ఏజెంట్‌ సినిమా పోస్టర్, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). మొదటి సినిమాతోనే సూపర్‌‌ హిట్‌ అందుకున్న ఫరియాకు అనుకున్న స్ధాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఫరియా చేతిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న ‘రావణాసుర’ సినిమా మాత్రమే ఉంది. అయితే ఆ సినిమాలో కూడా నలుగురు హీరోయిన్లలో ఒకరిగా ఫరియా నటిస్తున్నారు.

తమిళంలో 'వల్లి మెయిల్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఫరియా. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన 'బంగార్రాజు' సినిమాలో ఐటెం సాంగ్ చేసి అలరించారు ఫరియా. ఈ స్పెషల్‌ సాంగ్ ఫరియాకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో స్పెషల్‌ సాంగ్ చేసే అవకాశాన్ని ఫరియా దక్కించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)

త్వరలో అధికారిక ప్రకటన..

అక్కినేని అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు మేకర్స్. ఏజెంట్‌ సినిమాలోని ఒక స్పెషల్‌ సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి ఫరియాను సెలక్ట్ చేశారని టాక్.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఏజెంట్ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.  అఖిల్‌ స్పై ఏజెంట్‌గా నటిస్తున్న ఏజెంట్‌ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read More : 2022 సెకండాఫ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న టాలీవుడ్ (Tollywood) సినిమాలు.. వెయిటింగ్‌లో ఫ్యాన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!