Faria Abdullah: డ్యాన్స్ ఇరగదీసిన 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా..!

Published on Jun 07, 2022 07:07 PM IST

Faria Abdullah: టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాలు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మరోసారి డ్యుయెల్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో ‘పెళ్లి సంద‌D’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా, జాతిర‌త్నాలు సినిమాతో ఫేమస్‌ అయిన ఫ‌రియా అబ్దుల్లా కూడా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఫిమేల్ లీడ్ రోల్‌లో ఫరియా మెరవనుందని టాక్‌. ఈ సినిమాపై అనేక వార్తలు ఇండస్ట్రీలోనూ, సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా గురించి తాజాగా బయటకు వచ్చిన వార్త వైరల్ అవుతోంది.

ధమాకా సినిమాలో హీరో ర‌వితేజకు (Hero Raviteja) చెల్లెలిగా ఫ‌రియా నటిస్తోందనే వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్‌ మాత్రమే. ఎటువంటి అధికారిక ప్రకటన చిత్ర యూనిట్‌ నుంచి రాలేదు. అయితే ధమాకా సినిమాలో రవితేజకు చెల్లెలిగా ఫరియా నటిస్తుందనే వార్తలు, ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ అనే విషయాలను గమనిస్తుంటే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అప్‌డేట్ సంగతి ఎలా ఉన్నా.. సినిమా స్క్రీన్‌పై ర‌వితేజ‌, ఫ‌రియా అన్నాచెల్లెళ్లుగా ప్రేక్షకులను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నార‌నే చర్చ ఇప్పటికే మొదలైంది. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని ప్రిజం క్లబ్ లో 'సైఫర్ అవర్స్' ఆధ్వర్యంలో 'వాల్యూమ్ 11' పేరుతో జూన్ 25,26 తేదీల్లో అతిపెద్ద డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీనటులు (Faria Abdullah) ఫరియా అబ్దుల్లా, శాన్వీ మేఘన, సిద్దు జొన్నల గడ్డ, లక్ష్మీ మంచు, సుస్మిత కొణిదెల, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతి రత్నాలు బ్యూటీ డ్యాన్స్ చేసి అలరించారు. కాగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read More: Raviteja: వ‌రుసగా యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొడుతోన్న మాస్ మహరాజ్ ర‌వితేజ‌!