సంతోష్‌ శోభన్ (Santosh Shobhan), ఫరియా అబ్దుల్లా జంటగా Like, Share & Subscribe.. ఆసక్తికరంగా ట్రైలర్!

Updated on Oct 27, 2022 04:10 PM IST
Like, Share and Subscribe చిత్రంలో సంతోష్‌ శోభన్‌ ట్రావెల్‌ వ్లాగర్‌ గా నటిస్తున్నాడు.  ఫరియా అబ్దుల్లాతో (Faria Abdullah) ప్రేమలో పడతాడు.
Like, Share and Subscribe చిత్రంలో సంతోష్‌ శోభన్‌ ట్రావెల్‌ వ్లాగర్‌ గా నటిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లాతో (Faria Abdullah) ప్రేమలో పడతాడు.

టాలీవుడ్‌ యువ హీరో సంతోష్‌ శోభన్ (Santosh Shobhan), 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'Like, Share and Subscribe'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వెంకట్ బోయనపల్లి.. నిహారికా ఎంటర్‌టైన్‌ మెంట్‌-ఆముక్త క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 

'పేపర్ బాయ్' సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టి 'ఏక్ మినీ కథ' (Ek Mini Katha) మూవీ తో మంచి పేరు తెచ్చుకున్నాడు శోభన్. ఈ సినిమా సక్సెస్ తర్వాత 'మంచి రోజులు వచ్చాయి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే, 'ఏక్ మినీ కథ'కు స్టోరీ అందించిన మేర్లపాక గాంధీనే 'Like, Share and Subscribe' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది మూవీయూనిట్. 

ట్రైలర్ (Like, Share and Subscribe Trailer) లో డైలాగ్స్ తక్కువే ఉన్నా.. ‘‘దుశ్యాసనుడు ద్రౌపతి చీర లాగినపుడు శ్రీకృష్ణుడు చీర పంపే వరకూ వెయిట్ చేసింది. కానీ, కౌరవులను మాత్రం కమిలిపోయేలా కొట్టలేదు’’ అనే డైలాగ్ యూత్‌కు నచ్చుతుంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఫరియా, సంతోష్ శోభన్ మధ్య మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉండబోతోంది.

ఇక, ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌ ట్రావెల్‌ వ్లాగర్‌ విప్లవ్‌ గా నటిస్తున్నాడు. సంతోష్‌ శోభన్‌ అరకులో ఫరియా అబ్దుల్లాతో (Faria Abdullah) ప్రేమలో పడతాడు. కానీ ఈ ఇద్దరు సమస్యలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది..? వారిద్దరూ ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డారనేది సస్పెన్స్‌ లో పెడుతూ కట్‌ చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, మైమ్‌ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read More: Like, Share & Subscribe : ఈ కొత్త తెలుగు సినిమా గురించి టాప్ 10 విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!