జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) న‌టించిన‌ వ‌ల్లి మ‌యిల్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్

Updated on Jun 23, 2022 12:18 AM IST
ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah)  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌ల్లి మ‌యిల్ సినిమా స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.
ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌ల్లి మ‌యిల్ సినిమా స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

జాతి ర‌త్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క సినిమాతోనే ఫ‌రియా పాపుల‌ర్ హీరోయిన్‌గా మారారు. కోలీవుడ్ డెబ్యూ మూవీ వ‌ల్లి మ‌యిల్ (Valli Mayil) లో విజ‌య్ అంటోనికి జోడిగా ఫరియా అబ్దుల్లా న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంప్ర‌దాయ లుక్‌లో ఫ‌రియా అబ్ధుల్లా అద‌ర‌గొడుతున్నారు. 

ప‌లు సినిమాలతో బిజీగా మారిన చిట్టి
జాతిర‌త్నాలు సినిమా త‌ర్వాత ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత నాగార్జున‌, నాగ చైత‌న్య న‌టించిన బంగార్రాజులో ఫ‌రియా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించారు. వ‌ల్లి మెయిల్ సినిమాలో ఫ‌రియా డిఫెరెంట్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో ఆరడుగుల ఈ బ్యూటీ న‌టించ‌నున్నారు. 

ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah)  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌ల్లి మ‌యిల్ సినిమా స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్
ఫ‌రియాఅబ్దుల్లా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌ల్లి మ‌యిల్ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. విజ‌య్ అంటోని హీరోగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.  ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, భార‌తీ రాజా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 1980 సంవ‌త్స‌రానికి సంబంధించిన ఓ క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ్‌తో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. 

రవితేజ హీరోగా న‌టిస్తున్న రావ‌ణాసుర సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) న‌టిస్తున్నారు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో నటించేందుకు కూడా ఓ సినిమాని సైన్ చేశారు.  ఈసినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించబోతున్నారు. 

Read More: రవితేజ (Ravi Teja) చెల్లెలిగా జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?.. వైరల్ అవుతున్న న్యూస్‌

ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah)  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌ల్లి మ‌యిల్ సినిమా స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!