Agent Anand Santosh Trailer: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన షణ్ముఖ్ జస్వంత్..!

Updated on Jul 16, 2022 05:10 PM IST
'ఏజెంట్ ఆనంద్ సంతోష్' పోస్టర్స్ (Agent Anand Santosh Posters)
'ఏజెంట్ ఆనంద్ సంతోష్' పోస్టర్స్ (Agent Anand Santosh Posters)

Agent Anand Santosh Trailer: తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి 'ఆహా' (Aha OTT) ఓటీటీ ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తూ ముందుకెళ్తోంది. నిత్యం కొత్త సబ్జెక్ట్స్ తో వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ ముందుకు తెస్తూ అలరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆహా వేదిక పై ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్ తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ తన అభిమానుల కోసం ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో రాబోతున్నాడు. 

గత వారం విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌లో ఏజెంట్‌గా ఎలా నవ్వించబోతున్నాడో అందరికీ శాంపిల్ చూపించాడు షణ్ముఖ్ (Shanmukh Jaswanth). అయితే తాజాగా ఈ వెబ్ సిరిస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. నేటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ కట్ చేశారు. ఈ సిరీస్ లో షణ్ముఖ్ డిటెక్టివ్ గా నటిస్తున్నాడు. ఇందులో షణ్నూ తనదైన స్టైల్ కామెడీ పండించి మెప్పించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 

'ఏజెంట్ ఆనంద్ సంతోష్' ట్రైలర్ (Agent Anand Santosh Trailer) "మనిషి బతకడానికి జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు..ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తే " అనే డైలాగ్ తో మొదలవుతుంది. చిన్న చిన్న డిటెక్టివ్ పనులు చేసుకునే హీరో.. కూకట్ పల్లిలో వరుసగా కిడ్నాప్ అవుతోన్న అమ్మాయిల కేసుని చేధించాలని ఫిక్స్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే కథ అని తెలుస్తోంది. అయితే సీరియస్ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా షణ్ముఖ్ కామెడీ యాంగిల్ లో చిత్రీకరించినట్లు ఉన్నారు. జూలై 22 నుంచి ఈ సిరీస్ ను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

అయితే బిగ్ బాస్ షో (Telugu Biggboss) తరువాత షణ్ముఖ్ తన అభిమానులను పలకరించి చాలా రోజులైంది. మధ్యలో కొన్ని సినిమా ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చినట్టున్నాయి. కానీ అందులో మన షణ్ముఖ్.. ఈ ఏజెంట్ ఆనంద్ సంతోష్ కథను ఎంచుకున్నాడు. మొదట్లో ఇది యూట్యూబ్ కోసమేనని అంతా అనుకున్నారు. కానీ ఇది ఆహా కోసం చేసిన వెబ్ సిరీస్. దీని తరువాత యూట్యూబ్ కోసం షణ్ముఖ్ మరో వెబ్ సిరీస్ చేస్తానని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More: Agent Anand Santosh Teaser: 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌'గా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!