త్రిషపై మనసు పారేసుకున్న చిట్టి.. వర్షం సినిమాతో ఆమెకు ఫ్యాన్‌ అయ్యాను : ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)

Updated on Nov 01, 2022 10:13 PM IST
ఎక్కువగా హిందీ సినిమాలే చూసే తాను చూసిన మొదటి సినిమా వర్షం అని చెప్పారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)
ఎక్కువగా హిందీ సినిమాలే చూసే తాను చూసిన మొదటి సినిమా వర్షం అని చెప్పారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)

'జాతిరత్నాలు' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఈ సినిమాలో తన నటనతో యువత హృదయాలను దోచుకున్నారు. చిట్టిగా కుర్రాళ్ల కలల రాణిగా మారిన ఫరియా.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయారు. ఆ తర్వాత విభిన్న కథల కోసం వెయిట్ చేసి సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్' సినిమాలో నటించారు ఫరియా.

'లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్' సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో సంతోష్‌ శోభన్, ఫరియా ప్రముఖ టీవీ చానల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఫరియా అబ్దుల్లా సీనియర్ హీరోయిన్ త్రిషపై పలు కామెంట్లు చేశారు.

ఎక్కువగా హిందీ సినిమాలే చూసే తాను చూసిన మొదటి సినిమా వర్షం అని చెప్పారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)

మొదటి తెలుగు సినిమా ‘వర్షం’

ముందు నుంచి హిందీ సినిమాలు ఎక్కువగా చూసేదానినని చెప్పారు ఫరియా. తను చూసిన మొదటి తెలుగు సినిమా ‘వర్షం’ అని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ త్రిషను చూసి ఆమెకు ఫ్యాన్ అయిపోయానని చెప్పారు. త్రిష కోసమే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాను చాలాసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా చూసినప్పటి నుంచి హీరో సిద్దార్ధ్‌ అంంటే ఇష్టం ఏర్పడిందని అన్నారు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు ఫరియా అబ్దుల్లా (Faria Abdullah).

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి 'లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్' సినిమాను నిర్మించారు. సినిమా రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది చిత్ర యూనిట్. 'లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

Read More : Faria Abdullah: మరో ఐటెం సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!