Waltair Veerayya: చిరంజీవి (Chiranjeevi), బాబి కాంబోలో తెర‌కెక్కుతున్న 'వాల్తేరు వీర‌య్య' చిత్రం టాప్ 10 విశేషాలు..

Updated on Oct 07, 2022 06:03 PM IST
Waltair Veerayya : ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ సినిమాగా చిరంజీవి  (Chiranjeevi)  "మెగా 154" చిత్రం తెర‌కెక్కుతోంది.
Waltair Veerayya : ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ సినిమాగా చిరంజీవి  (Chiranjeevi) "మెగా 154" చిత్రం తెర‌కెక్కుతోంది.

Waltair Veerayya: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) "ఆచార్య" సినిమా ఫ్లాప్ త‌రువాత వ‌రుస సినిమాలతో వినోదం పంచాల‌ని చూస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన చిరంజీవి సినిమా "గాడ్ ఫాద‌ర్" చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ దిశ‌గా దూసుకెళుతోంది. 

"గాడ్ ఫాద‌ర్" త‌రువాత "మెగా 154"తో చిరు థియేట‌ర్ల‌ను షేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ సినిమాగా "మెగా 154" చిత్రం తెర‌కెక్కుతోంది. చిరంజీవి త‌న 154వ సినిమాకు "వాల్తేరు వీర‌య్య" అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ట‌. 2023 సంక్రాంతి పండుగ కానుక‌గా విడుద‌ల కానున్న "వాల్తేరు వీర‌య్య" సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..

Waltair Veerayya :  ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ సినిమాగా చిరంజీవి  (Chiranjeevi)

1. "వాల్తేరు వీర‌య్య" టైటిల్ క‌థ‌
చిరంజీవి
 (Chiranjeevi) తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమయ్యే క్రమంలో ఆయనకు వీర‌య్య అనే వ్య‌క్తి స‌హాయం చేశార‌ట‌. వీర‌య్య చిరంజీవి తండ్రి వెంకట్రావుకి సహోద్యోగి. వీరయ్య మంచి ఫోటోగ్రాఫర్ కూడా. చిరంజీవికి ఎన్నో ఫోటోలను ఆయన తీసిపెట్టేవారట. అంతేకాకుండా ఆ ఫోటోల‌ను నిర్మాణ సంస్థ‌ల‌కు పంపేవార‌ట‌. 

చిత్ర రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత, చిరంజీవికి తన కోసం వీరయ్య డిజైన్ చేసిన ఫోటో ఆల్బ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింద‌ట‌. వైజాగ్ నేప‌థ్యంలో సాగే ఓ సినిమా క‌థ విన‌గానే చిరంజీవికి వీర‌య్య గుర్తుకు వ‌చ్చార‌ట‌. అందుక‌నే త‌న 154వ  సినిమాకు వీర‌య్య‌ పేరు వ‌చ్చేలా టైటిల్ ఉంటే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు బాబీకి చెప్పార‌ట‌. 

2. డైరెక్ట‌ర్ చిరు అభిమానే
ద‌ర్శ‌కుడు బాబి అస‌లు పేరు కె.ఎస్. ర‌వీంద్ర‌. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌థా ర‌చ‌యిత‌గా, స్కీన్ ప్లే రైట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన బాబి.. ర‌వితేజ న‌టించిన "ప‌వ‌ర్" సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, ఎన్టీఆర్‌తో జై ల‌వ‌కుశ‌, వెంకీతో వెంకీమామ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

ర‌వితేజ ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల్లో బాబి ఒక‌రు. చిరంజీవికి బాబి పెద్ద అభిమాని. త‌న అభిమాన హీరోతో ఆయన బ్లాక్ బాస్ట‌ర్ సినిమాగా "వాల్తేరు వీర‌య్య‌"ను తెరకెక్కిస్తారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.  

3. చిరు సినిమాలో ర‌వితేజ‌
మాస్ మ‌హారాజా ర‌వితేజ "వాల్తేరు వీర‌య్య‌"లో ఓ ప్రత్యేక పాత్రలో న‌టిస్తున్నారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో ర‌వితేజ ఈ చిత్రంలో అలరించనున్నారు. ప్రస్తుతం ర‌వితేజ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. "చిరంజీవిని అరెస్ట్ చేసిన ర‌వితేజ" అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు "వాల్తేరు వీర‌య్య" చిత్రానికి ప్ల‌స్ కానున్నాయ‌ట‌.  

4. ప్ర‌త్యేక పాత్ర‌లో త‌మిళ న‌టుడు
"వాల్తేరు వీర‌య్య" చిత్రంలో త‌మిళ న‌టుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాబీ త‌మిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో సైతం ప‌లు సినిమాల్లో హీరోగా, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టించి మెప్పించారు. ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో బాబీ న‌టిస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  

5. సోద‌రుల మ‌ధ్య పోరు
"వాల్తేరు వీర‌య్య" సినిమాలో చిరంజీవి, ర‌వితేజ అన్నద‌మ్ములుగా న‌టిస్తున్నారని టాక్. ఇద్ద‌రు స‌వతి సోద‌రుల మ‌ధ్య జ‌రిగే పోరు ఈ సినిమాకి హైలైట్ అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రచారంలో నిజ‌మెంత ఉందో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. 

6. ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా!
"వాల్తేరు వీర‌య్య" సినిమా ఓటీటీ డీల్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రూ. 50 కోట్ల‌కు అమ్ముడయ్యాయ‌నే వార్త‌లు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సినిమా సెట్స్‌పై ఉన్న‌ప్పుడే ఇంత బిజినెస్ చేస్తే.. ఇక థియేట‌ర్ల‌లో ఓ రేంజ్‌లో బిజినెస్ ఉంటుంద‌ని సినీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

7. కొత్త పాత్ర‌లో చిరు
చిరంజీవి ఈ సినిమాలో మత్స్య కారుడిగా న‌టిస్తున్నారు. అలాగే ఆయన గెట‌ప్ చాలా కొత్తగా కనిపిస్తోంది. చెవికి పోగు, లుంగీతో చిరు మాస్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. 

8. ఇద్ద‌రు హీరోయిన్లా!
"మెగా 154"లో చిరంజీవికి జోడిగా క‌మ‌ల్ హాస‌న్ పెద్ద కుమార్తె శ్రుతి హాస‌న్ న‌టిస్తున్నారు. శ్రుతి హాస‌న్ ఈ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశారని టాక్.  కేథరిన్ థ్రెసా కూడా ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నున్నారు. 

9. మోత మోగనున్న పాట‌లు
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హరించనున్నారు. "పుష్ప" సినిమాతో ఇండియా లెవ‌ల్‌లో పాపుల‌ర్ అయిన దేవిశ్రీ ప్ర‌సాద్.. వాల్తేరు వీర‌య్య సినిమా పాట‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ట‌. మెగాస్టార్ రేంజ్‌కు తగినట్లుగా సంగీతం అందించ‌నున్నార‌ట‌. 

10. భారీ బ‌డ్జెట్ సినిమానేనా!
చిరంజీవి 154వ సినిమాను బ‌డా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప‌తాకంపై నిర్మాత‌లు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారట‌. తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

Read More: Mega 154: 'మెగా 154' ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?... చిరంజీవి (Chiranjeevi) సినిమాలో ఆ హీరోలు న‌టిస్తే ఇక జాత‌రే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!