Toofan Video Song: మీకో స‌ల‌హా ఇస్తాను.. అత‌నికి మాత్రం అడ్డు నిల‌బ‌డ‌కండి సార్..

Updated on May 19, 2022 10:29 AM IST
Toofan Video Song:  కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాలోని తుఫాన్ వీడియో సాంగ్ రిలీజ్
Toofan Video Song: కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాలోని తుఫాన్ వీడియో సాంగ్ రిలీజ్

Toofan Video Song: కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తుంది. కేజీఎఫ్2 టీం కూడా కొత్త అప్‌డేట్ ఇస్తూనే ఉంది. కేజీఎఫ్ చాప్ట‌ర్2 నుంచి తుఫాన్ సాంగ్ రిలీజ్ చేశారు. య‌శ్ అభిమానులు తుఫాన్ సాంగ్ రిలీజ్ అవ‌డంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

య‌శ్(Yash) హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌న్సేష‌న‌ల్ సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2(KGFChapter2). సౌత్, నార్త్ .. ఇండియాలో ప్రతీ ఏరియాలో బాక్సాఫీస్ షేక్ చేస్తూనే ఉంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో రూ.1200 కోట్లు వ‌సూళ్లు చేసిన రెండో సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. ఈ సినిమాలో య‌శ్ యాక్టింగ్, డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమాలో పాట‌లు కూడా మోత మోగిస్తున్నాయి. 

కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్న కలెక్ష‌న్‌ల తుఫాన్ మాత్రం కొన‌సాగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్ల‌స్ అయింది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి పాట‌ల‌ను రిలీజ్ చేస్తున్నారు. మీకో స‌ల‌హా ఇస్తాను.. అత‌నికి మాత్రం అడ్డు నిల‌బ‌డ‌కండి సార్.. డైలాగ్ త‌ర్వాత తుఫాన్ సృష్టించింది తుఫాన్ సాంగ్. ఎద‌గ‌రా, మెహ‌బూబా పాట‌లు యూట్యూబ్‌లో మిలియ‌న్ వ్యూస్ సాధించాయి. థియేట‌ర్ల‌లో మోత మోగించిన తుఫాన్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ పాట ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ సాధిస్తుందో చూడాలి. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 చిత్రాన్ని నిర్మించారు.
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!