బోయపాటి-రామ్ (Ram Pothineni) కాంబోలో వస్తున్న సినిమా నుంచి వరుస అప్డేట్స్.. హీరోయిన్ గా శ్రీలీల (Sree Leela)

Updated on Oct 13, 2022 12:20 PM IST
'పెళ్లి సంద‌D' శ్రీలీలను (Sree Leela) రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా కన్ఫమ్ చేశారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఎస్ఎస్ థమ‌న్‌ను ఖాయం చేసుకున్నారు.
'పెళ్లి సంద‌D' శ్రీలీలను (Sree Leela) రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా కన్ఫమ్ చేశారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఎస్ఎస్ థమ‌న్‌ను ఖాయం చేసుకున్నారు.

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను కాంబోలో  ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభమయింది. 

దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై రామ్ పోతినేని (Ram Pothineni) అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు కూడా అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రంపై మేక‌ర్స్ ఏకంగా మూడు క్రేజ్ అప్డేట్స్‌ను విడుదల చేశారు.

అందులో మొద‌టిది ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ, 'పెళ్లి సంద‌D' శ్రీలీలను (Sree Leela) రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా కన్ఫమ్ చేశారు. ఈ బ్యూటీని అషీషియల్ గా ఆహ్వానస్తూ ట్వీట్ చేశారు మేకర్స్. ఇక, మ‌రో అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ఎస్ థమ‌న్‌ను ఖాయం చేసుకున్నారు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే ప్రారంభమవుతుందని మేకర్స్ వెల్లడించారు.

 

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్స్ (Ram Movie Posters) కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖ నటీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. కాగా సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నుంది బోయ‌పాటి టీమ్.

Read More: రామ్ (Ram)-బోయపాటిల (Boyapari Srinu) మాస్ జాతర మొదలు కాబోతోంది.. దసరా సందర్భంగా అక్టోబర్5 నుంచి అప్డేట్స్ షురూ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!