NTR30: ‘ఎన్టీఆర్ 30’ పై అదిరిపోయే అప్డేట్.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం.. త్వరలో షూటింగ్ స్టార్ట్!
'ఎన్టీఆర్ 30' (NTR30).. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక మాస్ పోస్టర్ గ్లింప్స్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ఆ సినిమా చేయకుండా కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై చాలా కాలమైనా సరే ఇంకా కొరటాల శివ సినిమా ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
కొరటాల శివ (Koratala Siva)-ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన 'జనతా గ్యారేజ్' ఘన విజయం సాధించింది. దీంతో రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే ఈసినిమా ఈసినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు కానీ అది ఇంతవరకూ జరగలేదు.
మరోవైపు, ఎన్టీఆర్.. కొరటాల శివ (Koratala Siva) చేత అనేకసార్లు స్క్రిప్ట్ మార్పించారని ఎట్టకేలకు స్క్రిప్ట్ ఫైనల్ అయిందని మరికొద్ది రోజుల్లో షూటింగ్ జరగబోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అది ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఏమో అనే అనుమానాలు వ్యక్తమవడంతో సినిమా పిఆర్ టీమ్ స్పందిస్తూ ఓ అప్డేట్ ను విడుదల చేసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ (NTR30 PreProduction Work) పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కూడా సమాచారం.
ఇక, ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా చైనీస్, జపనీస్‌లతో పాటు దాదాపు 9 విదేశీ భాషల్లో కూడా ‘ఎన్టీఆర్ 30’ (NTR30) విడుదల కాబోతున్నట్టు సమాచారం.