స‌లార్ (Salaar) : డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ టీమ్ నుండి.. ఓ క్రేజీ అప్‌డేట్

Updated on May 22, 2022 01:36 PM IST
Salaar : ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ వ్యూస్‌ను హోంబ‌లే సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. 
Salaar : ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ వ్యూస్‌ను హోంబ‌లే సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. 

ప్ర‌భాస్  నటిస్తున్న సినిమా స‌లార్  (Salaar) పై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్  ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై అభిమానులు నిత్యం చర్చించుకుంటున్నారు. ఈ ఆసక్తిని మరింత పెంచుతూ, ప్ర‌శాంత్ నీల్ (Prasanth  Neel) స‌లార్‌‌‌లో ప్రభాస్‌ క్యారెక్టర్ ఎలా ఉంటుందన్న అంశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. ప్ర‌శాంత్ నీల్ 'డైరెక్ష‌న్ వ్యూస్‌' గురించి.. హోంబ‌లే సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. 

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) నటిస్తున్న స‌లార్ తాజా అప్‌డేట్స్ కోసం, నిర్మాతలు ఓ ట్విట్ట‌ర్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఆ ట్విట్ల‌ర్‌ ఖాతా ద్వారా,  ఇక స‌లార్ అప్‌డేట్స్‌తో నిత్యం ట్వీట్లు రానున్నాయి. ఈ ట్వీట్స్‌లో భాగంగానే, నిర్మాణ సంస్థ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంపై ఓ వీడియోను రిలీజ్ చేసింది హోంబ‌లే సంస్థ‌. స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, ఆర్డ్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్ ఈ వీడియోలో, ప్ర‌భాస్ యాక్ష‌న్ సీన్స్ గురించి చ‌ర్చించుకోవడం గమనార్హం. ఆ చర్చా స‌న్నివేశాన్ని వీడియో తీసి ప్ర‌భాస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్మాతలు రిలీజ్ చేశారు. 

ఇటీవలే 'సలార్' సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్స్ ఇవ్వ‌కుంటే, ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ ప్ర‌శాంత్ నీల్‌కు ప్ర‌భాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన తర్వాత  'స‌లార్ - ది సాగా' పేరుతో అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను నిర్మాతలు ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ ద్వారా వ‌రుస అప్‌డేట్స్ ఇవ్వ‌డానికి సిద్ధమ‌య్యారు. ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్‌'లో ప్ర‌భాస్ యాక్ష‌న్ సీన్స్‌ను అదిరిపోయేలా తీయ‌నున్నారు. అందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. కేజీఎఫ్‌తో ఇండియ‌న్ సినిమా రికార్డులను బ్రేక్ చేసిన ప్ర‌శాంత్ నీల్, స‌లార్‌తో ఇంకెన్ని రికార్డులు బ‌ద్దలు కొడ‌తారో?

హోంబ‌లే ఫిలిమ్స్ రూ.200 కోట్ల భారీ వ్యయంతో స‌లార్ సినిమాను నిర్మిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో, ప్ర‌త్యేక సెట్స్ వేసి స‌లార్ షూటింగ్ చేస్తున్నారు. స‌లార్ సినిమా షూటింగ్ ,ఇప్ప‌టికే 30 శాతం పూర్తి చేసుకుంద‌ని ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిరంగ‌న్‌దూర్ చెప్పారు. ప్ర‌శాంత్ నీల్ కూడా స‌లార్ షూటింగ్‌పైనే పూర్తిస్థాయిలో ఫోక‌స్ పెట్టార‌న్నారు. స‌లార్ (Salaar)  షూటింగ్ 2022 న‌వంబ‌ర్ లోపు పూర్తి అవుతుంద‌ని నిర్మాతలు తెలిపారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!