నా ఫేవరేట్ హీరో రాజశేఖర్ (Rajasekhar) : డైరెక్టర్ సుకుమార్
PSV గరుడవేగ, కల్కి తర్వాత రాజశేఖర్ (Rajashekhar) "శేఖర్" సినిమాలో నటించారు. కరోనా నుంచి కోలుకున్నాక తర్వాత, ఆయన చేసిన తొలి చిత్రమిది. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మికలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. "శేఖర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా సుకుమార్ వచ్చారు. రాజశేఖర్ వల్లే తాను సినిమా రంగంలోకి వచ్చానని చెబుతూ, తన గత అనుభవాలను నెమరువేసుకున్నారు
ఆర్య సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో కూడా పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో రాజశేఖర్ నటించిన "శేఖర్" సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సుకుమార్ గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా, రాజశేఖర్ అంటే తనకు ఎంత అభిమానమో సుకుమార్ చెప్పారు.
కాలేజీ డేస్‌లో రాజశేఖర్ తన ఫేవరేట్ హీరో అని దర్శకుడు సుకుమార్ అన్నారు. రాజశేఖర్‌ను ఇమిటేట్ చేయడంతో తన ఫ్రెండ్స్ దగ్గర పాపులర్ అయ్యానని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ గారి వల్లే తాను ఇంత గొప్ప దర్శకుడు అయ్యానని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు సినిమా అంటే ఏంటో రాజశేఖర్ పరోక్షంగా తెలిసేలా చేశారన్నారు. తన కుమార్తెలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి రాజశేఖర్ ఇండస్ట్రీ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. జీవిత "శేఖర్" సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో తనకు తెలుసన్నారు. ఫ్యామిలీ, డైరెక్షన్, ప్రమోషన్స్ జీవిత ఒక్కరే దగ్గరుండి చూసుకున్నారని.. జీవిత ఈజ్ గ్రేట్ అంటూ సుకుమార్ కితాబునిచ్చారు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ సుకుమార్ "శేఖర్" ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు.
మలయాళంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు అధికారిక రీమేక్‌గా "శేఖర్" చిత్రాన్ని తెరకెక్కించారు జీవిత. ఈ సినిమాలో రాజశేఖర్ (Rajashekhar) ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్.. ఓ కీలక పాత్రలో శేఖర్ మూవీలో నటించడం విశేషం. శేఖర్ సినిమా మే 20 న రిలీజ్ కానుంది.