'ఓరి దేవుడా..' (Ori Devuda) సక్సెస్ సంబరాల్లో విశ్వక్ సేన్ (Vishwak sen).. థియేటర్ వద్ద సందడి చేసిన యంగ్ హీరో!

Published on Oct 26, 2022 03:34 PM IST

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. 

గతేడాది ‘పాగల్’ సినిమాతో పరాజయం అందుకున్న విశ్వక్.. ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా, ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

ఇక, విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ (Ori Devuda). తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కడవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాలో లవ్ గాడ్‌గా ఓ స్పెషల్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించారు. 

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఓరి దేవుడా..' (Ori Devuda) చిత్రం అక్టోబర్‌ 21న విడుదలై బ్రహ్మాండమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద విశ్వక్ సేన్ అభిమానులు తెగ సందడి చేశారు. 

బాణాసంచా కాలుస్తూ.. కేరింతలతో అలరించారు. ఇక, ఈ చిత్రం విడుదలైన థియేటర్ వద్ద హీరో విశ్వక్ చిత్ర యూనిట్ తో పాటు తన తల్లితో (Vishwak Sen With His Mother) కలిసి సినిమాను వీక్షించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

Read More: Ori Devuda Movie Review : ప్రేమ, పెళ్ళి విషయంలో.. దేవుడిని సెకండ్ ఛాన్స్ అడిగే భక్తుడి కథ !