'అన్‌స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable Season 2) రెండో ఎపిసోడ్ ప్రోమో (Promo) అదిరిపోయిందిగా.. గెస్టులు వీరే!

Updated on Oct 17, 2022 02:08 PM IST
టాలీవుడ్ యువ నటులు ‘దుందార్ దాస్’ విశ్వక్ సేన్ (Vishwak sen).. ‘పగ్లా టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) వచ్చారు.
టాలీవుడ్ యువ నటులు ‘దుందార్ దాస్’ విశ్వక్ సేన్ (Vishwak sen).. ‘పగ్లా టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) వచ్చారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం 'ఆహా'లో (Aha) ప్రసారమైన 'అన్‏స్టాపబుల్ సీజన్ 1' టాక్ షో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టాక్‌ షోకి హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఆయనలోని సరదా కోణాన్ని ప్రేక్షకులని, తెలుగు సినీ లవర్స్‌కి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో 'అన్‌స్టాపబుల్ షో సీజన్ 2'ని ఇటీవల గ్రాండ్ గా లాంచ్ చేశారు.

అన్‌స్టాపబుల్ సీజన్ 2లో (Unstoppable Season 2) మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన బావ, అల్లుడికి తనదైన శైలిలో చలాకీగా ప్రశ్నలు వేస్తూ.. వారి నుంచి సమాధానాలు రాబడుతూ.. వారిద్దరిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యారు బాలయ్య. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది.

 తాజాగా ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ ఎపిసోడ్‌ ప్రోమోని ‘ఆహా’ వీడియో విడుదల చేసింది. దానికి అతిథులుగా టాలీవుడ్ యువ నటులు ‘దుందార్ దాస్’ విశ్వక్ సేన్ (Vishwak sen).. ‘పగ్లా టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) వచ్చారు. అందులో ఎప్పటిలాగే.. బాలయ్య తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు.

షో లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సిద్దు హెయిర్ స్టైల్ పై పంచ్ వేశారు బాలకృష్ణ (Nandamuri Balakrishna). తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ బాలయ్య అరవగా.. అది మెస్సీ లుక్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు సిద్దూ.. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన చిత్రాలన్ని మెస్సీ అయినంటూ పంచ్ వేశారు బాలయ్య.

ఇక, యువ నటులు ఇద్దరితో సరదాగా మాట్లాడుతూ.. వారి దగ్గర నుంచి ఎన్నో ఆసక్తికర విషయాలను రాబట్టారు. ఆ షోలో తన తాజా క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అని బాలకృష్ణ తెలిపారు. అలాగే.. కుర్ర హీరోల క్రష్ నుంచి నైట్ వేసే పెగ్గు వరకు ఎన్నో సరదాగా మాట్లాడుతూనే రాబట్టారు. అందులో బాలయ్య వేసే పంచులకి విశ్వక్ సేన్ అయితే.. చెమటలు పట్టిస్తున్నారు సర్ అని అనేశారు.

చివరగా.. ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి కాసేపు ఫ్లర్ట్ చేశారు బాలయ్య. ఆ హీరోయిన్ తో బాలయ్య మాట్లాడుతూ.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అని అన్నారు. సిద్ధు పక్కన కూర్చొని వింటుంటే నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడుకోవాలి అని సరదాగా అన్నారు. ఆ ఫోన్ లో మాట్లాడిన హీరోయిన్ ఎవరా అనేది తెలియాలంటే.. రెండో ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ అక్టోబర్ 21న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!