Hello World Web Series: 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్.. నిహారికపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Aug 17, 2022 01:19 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) యాంకర్ గా, యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం నిర్మాతగా వెబ్ సిరీస్ (Web Series) లు నిర్మిస్తోంది. మెగా కుటుంబానికి చెందిన నిహారిక సినిమాలతో, తన నటనతో ఆకట్టుకోలేక ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయింది. నిహారికకు ఓటీటీలే ఎక్కువగా కలిసి వచ్చాయి. ఆమె నిర్మించిన 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్నకూచి' వంటి వెబ్ సిరీస్‌లు బాగానే ఆడాయి. ఇక ఆ మధ్య ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించగా.. అది సూపర్ హిట్ అయింది. 

నిహారిక ప్రస్తుతం కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'హలో వరల్డ్' (Hello World) అంటూ ఆర్యన్ రాజేష్, సదా హీరోహీరోయిన్లుగా మరో వెబ్ సిరీస్ ప్రారంభించింది. ఈ వెబ్ సిరీస్ 'జీ5'లో రిలీజ్ అయింది. ఇక, ఈ సిరీస్ సక్సెస్ కోసం ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ను రంగంలోకి దింపింది. ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ ను ఆహ్వానించింది.     

'హలో వరల్డ్' ప్రమోషన్స్ (Hello World Promotions) ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను. అక్కడ కాలేజిలో నేను ఎవ్వరికి భయపడేవాడ్ని కాదు. కానీ నిహారిక కొణిదెల అని ఒక సీనియర్ ఉండేది. తనకి మాత్రం భయపడేవాడ్ని. అప్పట్లో ఏయ్ అంటూ బెదిరించేది. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏయ్ అని అనగానే ఇలా ఈవెంట్ కి వచ్చేశాను. ఇప్పుడు నిహారిక మెగా లేడీ ప్రొడ్యూసర్‌ అయింది" అని అన్నాడు.

విశ్వక్ సేన్ నిహారిక గురించి అలా మాట్లాడుతూ ఉంటే.. మధ్య మధ్యలో మైక్ ఆగిపోయింది. ఏంటి నువ్వేనా? ఆపించావా? అంటూ నిహారిక మీద విశ్వక్ సేన్ సెటైర్లు వేశాడు. లేదురా బాబు అన్నట్టుగా నిహారిక ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేసింది. ఇక స్టేజ్ మీద విశ్వక్ తెగ నవ్వించేశాడు. రాధిక (Neha Shetty) (డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి) నీ వల్ల ఈ ప్రోగ్రాం ఇంకో స్థాయికి వెళ్లింది.. హై హీల్స్ వేసుకుని వచ్చావ్ అంటూ విశ్వక్ సేన్ మరింతగా నవ్వులు పూయించాడు. 

Read More: Hello World Web Series: 'ఆర్యన్ రాజేష్' ప్రధాన పాత్రలో 'హలో వరల్డ్' వెబ్ సిరీస్.. ఆగస్టు12 నుంచి జీ5లో ప్రసారం