Das Ka Dhamki: విశ్వక్ సేన్ (Vishwak Sen) “దాస్ కా ధ‌మ్కీ” సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

Updated on Sep 02, 2022 07:34 PM IST
విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెర‌కెకిస్తున్న‌ చిత్రం 'దాస్‌ కా ధమ్కీ'. మ‌రో వారంలో సినిమా షూటింగ్‌ను పూర్తి కానుంది.
విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెర‌కెకిస్తున్న‌ చిత్రం 'దాస్‌ కా ధమ్కీ'. మ‌రో వారంలో సినిమా షూటింగ్‌ను పూర్తి కానుంది.

Das Ka Dhamki: టాలీవుడ్ హీరో విశ్వ‌క్ సేన్ (Vishwaksen) 'ఫలక్‌నుమా దాస్‌'తో త‌న టాలెంట్ ఏంటో ప్రేక్ష‌కుల‌కు చూపించారు. విశ్వక్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా దర్శకత్వం కూడా వ‌హించారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెర‌కెకిస్తున్న‌ చిత్రం 'దాస్‌ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ బ్యానర్లపై ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నారు. 

దీపావ‌ళికి ఫ‌స్ట్ లుక్

'దాస్ కా ధ‌మ్కీ' చిత్రంలో విశ్వ‌క్ సేన్ (Vishwaksen) కు జోడిగా నివేదా పేతురాజ్ న‌టిస్తున్నారు. ల‌వ్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. 'దాస్ కా ధ‌మ్కీ' చిత్రం ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. మ‌రో వారంలో సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షూటింగ్‌ను పూర్తిచేయ‌నున్నారు. 

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెర‌కెకిస్తున్న‌ చిత్రం 'దాస్‌ కా ధమ్కీ'. మ‌రో వారంలో సినిమా షూటింగ్‌ను పూర్తి కానుంది.

'ఆర్‌ఆర్‌ఆర్‌', 'హరిహర వీరమల్లు' సినిమాల‌ఫైట్ మాస్టర్స్‌ టోడర్ లాజరోవ్, జుజిల‌తో 'దాస్ కా ధ‌మ్కీ' సినిమా ఫైట్ సీన్ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందించారు. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. దీపావళి పండుగ‌కు 'దాస్ కా ధ‌మ్కీ' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.  

ఇటీవలే ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేసిన‌ విశ్వ‌క్ సేన్‌.. ఈ సినిమా కోసం ఎలాంటి హంగామా చేయ‌నున్నారో!.

Read More: Ori Devuda: నా దేవుడు 'విక్టరీ వెంక‌టేష్' (Venkatesh) అంటున్న‌ విశ్వ‌క్‌సేన్ (Vishwaksen)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!