తేజా సజ్జా (Teja Sajja) హీరోగా సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో 'హనుమాన్' (Hanuman).. నవంబర్ 15న టీజర్ రిలీజ్..!

Updated on Nov 07, 2022 02:57 PM IST
సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంలో తేజ సజ్జాకు (Teja Sajja) జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తోంది.
సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంలో తేజ సజ్జాకు (Teja Sajja) జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తోంది.

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prashant Varma) ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో ‘హనుమాన్‌’ (Hanuman) అనే పాన్‌ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. యువ హీరో తేజా సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

తాజాగా 'హనుమాన్' (Hanuman) చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. 'హనుమాన్' మూవీ టీజర్ ను నవంబర్ 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఒక బండపై తేజ సజ్జ నిల్చొని శంఖం పూరిస్తున్నట్లు ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు (Teja Sajja) జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తోంది. 'డాక్టర్‌' ఫేం వినయ్‌రాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. టీజర్‌ రిలీజ్ రోజు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. 

ఇదిలా ఉంటే.. తేజ సజ్జా (Teja Sajja) చిన్న వయసులోనే ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే 'ఓ బేబీ', 'జాంబి రెడ్డి' వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇక, కొంత కాలం క్రితమే తేజ సజ్జా "అద్భుతం" అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 

Read More: 'HIT 2' Teaser: 'హిట్ 2' టీజర్ వచ్చేసింది.. మరోసారి థ్రిల్లర్ కథాంశంతో సందడి చేస్తున్న అడివి శేష్ (Adivi Sesh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!