వివాదంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).. ప్రైవేట్ సాంగ్ లో బూతు మంత్రం.. పోలీసులకు ఫిర్యాదు!

Updated on Nov 03, 2022 03:53 PM IST
'ఓ పారి' (తెలుగులో ఓ పిల్లా) అనే ఈ పాప్ ఆల్బమ్ (O Pari Pop Album) ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది విడుదలైంది.
'ఓ పారి' (తెలుగులో ఓ పిల్లా) అనే ఈ పాప్ ఆల్బమ్ (O Pari Pop Album) ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది విడుదలైంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ఈ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ కు మాత్రమే కాకుండా తమిళ, హిందీ సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ ఉంటారు. అయితే వివాదాలకు దూరంగా ఉండే దేవిశ్రీ ప్రసాద్ తాజాగా అనూహ్యరీతిలో ఓ వివాదంలో చిక్కుకున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న డీఎస్పీ.. ఈ మధ్య పాన్ ఇండియా పాటలో నటించాడు. డ్యాన్స్ కూడా చేశారు. 'ఓ పారి' (తెలుగులో ఓ పిల్లా) అనే ఈ పాప్ ఆల్బమ్ (Pop Album) ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది విడుదలైంది. ఇప్పటివరకు 20మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ దేవి శ్రీ ప్రసాదే అందించారు.

భారీ బడ్జెట్ తో స్పెయిన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ సాంగ్ షూటింగ్ కూడా చేశారు. ఈ పాటకు సంబంధించిన అన్ని బాధ్యతలు తానే చూసుకున్న దేవిశ్రీప్రసాద్ ఎట్టకేలకు ఈ సాంగ్ రిలీజ్ చేశాడు కానీ అభిమానులకు మాత్రం ఈ సాంగ్ అంతగా నచ్చలేదు. సాంగ్ కొరియోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని సాంగ్ చూసిన వారందరూ పెదవి విరుస్తున్నారు. 

అయితే.. 'ఓ పారి' (O Pari Song) అంటూ సాగే ఈ ఆల్బమ్ లో 'హరే రామ, హరే కృష్ణ' మంత్రాన్నివాడారు. ఈ నేపథ్యంలో ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో 'హరే రామ హరే కృష్ణ' (Hare Rama Hare Krishna) మంత్రం ఎలా వాడుతారని దేవీ పై కంప్లెయింట్ చేశారు సినీ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani). కోట్లాది మంది జపించే 'హరేరామ హరే కృష్ణ' పవిత్ర మంత్రాన్ని ఓ ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలని గాయపరిచారని భారతీయ జనతా పార్టీ సైతం ఆరోపించింది. 

ఇక ఈ సాంగ్ దారుణంగా ఉందని, తక్షణం అన్నిచోట్లా దాన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నటి కరాటే కళ్యాణి (Karate Kalyani), హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Read More: 'HIT 2' Teaser: 'హిట్ 2' టీజర్ వచ్చేసింది.. మరోసారి థ్రిల్లర్ కథాంశంతో సందడి చేస్తున్న అడివి శేష్ (Adivi Sesh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!