"ఇంగ సెప్పేది ఏం లేదో... సేసేదే".. 'హరోం హర' (Harom Hara) అంటున్న నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudhher Babu)!

Updated on Oct 31, 2022 05:24 PM IST
‘హరోం హర’ (Harom Hara) అనే పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక టైటిల్‌ను తన సినిమాకు పెట్టారు సుధీర్ బాబు (Sudheer Babu). ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్ లైన్. 
‘హరోం హర’ (Harom Hara) అనే పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక టైటిల్‌ను తన సినిమాకు పెట్టారు సుధీర్ బాబు (Sudheer Babu). ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్ లైన్. 

నైట్రో స్టార్ సుధీర్ బాబుకు (Sudheer Babu) సరైన హిట్ వచ్చి చాలా రోజులే అయింది. ఈ ఏడాది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ యంగ్ హీరో. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాస్ మూవీ ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను అనౌన్స్ చేసిన సుధీర్ బాబు ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా కు రెడీ అయ్యారు. 

సుధీర్ బాబు ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓవైపు పుల్లేటి గోపీచంద్ బయోపిక్ లో నటిస్తూనే, మరోవైపు ‘హంట్’ (Hunt) అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. అదే 'హరోం హర' (Harom Hara) మూవీ. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ వీడియోను విడుదల చేశారు సుధీర్ బాబు. టైటిల్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు సంబంధించి గత మూడు రోజులుగా సుధీర్ బాబు (Sudheer Babu) అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు. ‘సెహరి’ లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకను తన 18వ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు సుధీర్ బాబు. ఆ సినిమా టైటిల్‌ను నేడు ప్రకటించారు. ‘హరోం హర’ (Harom Hara) అనే పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక టైటిల్‌ను తన సినిమాకు పెట్టారు నైట్రో స్టార్. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్ లైన్. 

టైటిల్ వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదు సేసేదే’ అంటూ సుధీర్ విభిన్నమైన యాసతో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. బ్యాగ్రౌండ్ ఆధారంగా చూస్తే ఆధ్యాత్మిక అంశాలు కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 1989నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే పాత్రలన్నీ చిత్తూరు భాషలోనే మాట్లాడుతున్నాయి. ఇందులో సుధీర్ బాబు, శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా కనిపించనున్నారు. 

 

ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ (Sudheer Babu Mass Look) మాస్ లుక్ కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘హరోం హర’ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

Read More: పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా సుధీర్ బాబు (Sudheer Babu) 18వ సినిమా.. వినూత్నంగా పోస్టర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!