సుధీర్ బాబు హీరోగా (Sudhher Babu) 'హంట్' (Hunt).. అదరగొడుతున్న 'పాపతో పైలం' ఐటం సాంగ్!

Updated on Oct 13, 2022 12:23 PM IST
'హంట్' (Hunt) మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే లిరికల్ ఐటమ్ సాంగ్ (Hunt Item Song) రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
'హంట్' (Hunt) మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే లిరికల్ ఐటమ్ సాంగ్ (Hunt Item Song) రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudhher Babu) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్' (Hunt). 'గన్స్ డోన్ట్ లై' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా యువ దర్శకుడు మహేశ్ టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని వర్గాల ఆడియన్స్ కోరుకునేలా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఎంతో ఆకట్టుకుని మూవీపై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే లిరికల్ ఐటమ్ సాంగ్ (Hunt Item Song) రిలీజ్ చేసింది చిత్రయూనిట్. విడుదలైన కొన్ని క్షణాల్లో ఈ పాట వైరల్ అయ్యింది. విజువల్స్ చూస్తే పబ్‌లో ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా రిచ్‌గా షూట్ చేసినట్లు అర్థం అవుతోంది. ఈ సాంగ్ లో సుధీర్ బాబు, అప్సర రాణితో పాటు నటుడు భరత్ కూడా అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించారు. 

'పాపతో పైలం' గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. మంగ్లీ, 'పుష్ప' ఫేమ్ ('ఏ బిడ్డా ఇది నా అడ్డా..') నకాష్ అజీజ్ ఆలపించారు. చిత్రనిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. "సుధీర్ బాబు (Sudhher Babu), శ్రీకాంత్, భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.  

Read More: 'హంట్' టీజర్ (Hunt Teaser) మామూలుగా లేదుగా.. అదిరిపోయిన సుధీర్ బాబు (Sudheer Babu) యాక్షన్ సీన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!