'హంట్' టీజర్ (Hunt Teaser) మామూలుగా లేదుగా.. అదిరిపోయిన సుధీర్ బాబు (Sudheer Babu) యాక్షన్ సీన్స్!

Updated on Oct 06, 2022 11:49 PM IST
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie).
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie).

టాలీవుడ్‌లో ఫలితంతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో సుధీర్‌బాబు (Sudheer Babu). 'ఎస్ఎంఎస్' (SMS) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయిన సుధీర్ బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie). భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. కాగా, జిబ్రాన్‌ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

'హంట్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలయిన పోస్టర్లు సినిమాపై హైప్ ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ (Hunt Teaser) రిలీజ్ అయింది. ఈ టీజర్ లో సుధీర్ బాబు దుమ్ము లేపేశాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ను చూస్తుంటే.. సుధీర్ బాబు 'గజిని' తరహాలో గతం మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇక సుధీర్ ఈ మూవీలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. 

''ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి'' అని శ్రీకాంత్ (Actor Srikanth) చెప్పే డైలాగ్ గానీ, ''తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు'' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. 

Read More: 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) ఆఫర్ ను వదులుకున్నా.. కారణమిదే అంటున్న హీరో సుధీర్ బాబు (Hero Sudhher Babu)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!