'బ్రహ్మాస్త్ర' (Brahmastra) ఆఫర్ ను వదులుకున్నా.. కారణమిదే అంటున్న హీరో సుధీర్ బాబు (Hero Sudhher Babu)..!

Updated on Sep 17, 2022 07:04 PM IST
సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలియజేశారు.
సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలియజేశారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సుధీర్ బాబు (Hero Sudhher Babu). సెప్టెంబర్ 16న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. 

ఇక హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి (Krithi Shetty) కి సక్సెస్ లేక ఎన్నో రోజుల నుంచి సతమతమవుతున్నారు. దీంతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల ముందు వరకు ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు చిత్ర బృందం.

ఈ ప్రమోషన్లలో ఉన్నప్పుడు హీరో సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించారు. 

అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సుధీర్ (Sudheer Babu) బాబుని నిర్మాతలు సంప్రదించారట. దీనిపై ఆయన స్పందిస్తూ.. "బ్రహ్మాస్త్ర" సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించమని తనను డైరెక్టర్ కోరారని, అయితే ఇక్కడ సినిమాలతో బిజీగా ఉండి డేట్లు ఖాళీ లేక "బ్రహ్మాస్త్ర" సినిమాని వదులుకున్నానని, అంతకు మించి ఏమి లేదని.. బాలీవుడ్ నుంచి మళ్ళీ ఆఫర్స్ వచ్చి,తన డేట్స్ కూడా ఖాళీగా ఉంటే కచ్చితంగా సినిమా చేస్తానని తెలిపాడు. అయితే "బ్రహ్మాస్త్ర" సినిమాలో ఏ పాత్ర నిమిత్తం ఛాన్స్ వచ్చిందన్నది మాత్రం బహిర్గతం చేయలేదు  సుధీర్ బాబు.

ఇదిలా ఉంటే.. సినిమాల ఎంపిక విషయంలో ప్రస్తుతం ఉన్న హీరోలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథ బలంగా ఉంటేనే సినిమాలను చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇదే పద్ధతిని ప్రస్తుతం ఫాలో అవుతున్నాడు యువ హీరో సుధీర్ బాబు (Sudheer Babu).

Read More: "మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో చేయడం ఎంతో ఆనందంగా ఉంది": సుధీర్ బాబు (Sudhher Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!