"మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో చేయడం ఎంతో ఆనందంగా ఉంది": సుధీర్ బాబు (Sudhher Babu)

Updated on Sep 14, 2022 06:53 PM IST
హీరో సుధీర్ బాబు (HeroSudheer Babu) మాట్లాడుతూ.. "తన కెరీర్ లో మొత్తం మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణతో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
హీరో సుధీర్ బాబు (HeroSudheer Babu) మాట్లాడుతూ.. "తన కెరీర్ లో మొత్తం మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణతో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

యంగ్ హీరో సుధీర్ బాబు (Sudhher Babu), 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) డైరెక్షన్‌లో సుధీర్ బాబు నటిస్తున్న మూడో చిత్రం ఇది.

నాలుగేళ్ళ క్రితం ఇంద్రగంటి-సుధీర్ కాంబినేషన్‌లో మొదటిసారి 'సమ్మోహనం' (Sammohanam) సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి టాక్ రావడమే కాకుండా, విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

గత రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఒక డైరెక్టర్ ఒకే హీరోతో కలిసి మూడు వరుస సినిమాలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సెప్టెంబర్ 16న ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండడంతో.. మూవీ మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను (Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event) మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు.

చాలామంది ప్రముఖ నటులు, దర్శకులు ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాగచైతన్య (Naga Chaitanya), అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు.. అనిల్ రావిపూడి (Anil Ravipudi), హరీష్ శంకర్, పరశురామ్, వెంకీ కుడుముల, రాహుల్ సాంకృత్యాయన్ వంటి దర్శకులు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) ఈవెంట్‌లో భాగంగా హీరో సుధీర్ బాబు (HeroSudheer Babu) మాట్లాడుతూ.. "తన కెరీర్‌లో మొత్తం మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దాదాపుగా అన్ని జానర్స్‌లో సినిమాలు చేసిన ఇంద్రగంటి గారు ఒక వికీపీడియా వంటి వారని, ఆయన దర్శకత్వంలో వర్క్ చేయడం ఒక పెయిడ్ హాలిడేకి వెళ్లినట్లుంటుంది" అని అన్నారు.

కృతి శెట్టి (Kriti Shetty) మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేస్తున్నప్పుడు.. ఒక అమ్మాయికి ఇంద్రగంటిగారు ఇచ్చే స్పేస్.. స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందనేది చూసిన తరువాత..  తనకి చాలా హ్యాపీగా అనిపించిందని' చెప్పారు. సుధీర్ బాబుగారితో కలిసి నటించడం వలన తాను చాలా విషయాలను నేర్చుకున్నానని అన్నారు.

Read More: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి సాంగ్ రిలీజ్!.. త‌న‌కు న‌చ్చిన‌ పాటన్న సుధీర్ బాబు ( Sudheer Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!