రామ్ (Ram)-బోయపాటిల (Boyapari Srinu) మాస్ జాతర మొదలు కాబోతోంది.. దసరా సందర్భంగా అక్టోబర్5 నుంచి అప్డేట్స్ షురూ

Updated on Oct 06, 2022 11:45 PM IST
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Hero Ram) ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్‌ అయింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Hero Ram) ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్‌ అయింది.

టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu), యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు లవర్ బాయ్‌ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న రామ్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత.. మాస్ హీరోగా అవతారమెత్తి ప్రస్తుతం మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. 

కాగా, రామ్ ఈ సంవత్సరం 'ది వారియర్' (The Warrior) సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో విడుదలయింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదలయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది.

ఇక, ‘అఖండ’తో (Akhanda) ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ అయింది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9గా శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పను‌లను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు.

రామ్-బోయపాటి (Boyapati Srinu) సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అక్టోబర్ 5న దసరా రోజు నుండి గట్టిగా ఇస్తామంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను బోయపాటి మార్క్ మాస్, రామ్ పోతినేని మార్క్ ఎనర్జీతో కలిపి తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమాలోని అదిరిపోయే అప్డేట్స్ కోసం దసరా రోజు వరకు ఆగాల్సిందే. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ పోతినేని (Ram Pothineni) కాలేజ్ లెక్చరర్ పాత్రలో సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రామ్ సరసన సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni).. తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్న యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!