ఖమ్మం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన నటులు రామ్ పోతినేని (Ram Pothineni), రీతూవర్మ (Ritu Varma)
ఖమ్మం నగరంలోని వైరారోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని టాలీవుడ్ నటులు రామ్ పోతినేని (Ram Pothineni), రీతూవర్మ ప్రారంభించారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ, డైరెక్టర్ మావూరి మోహనబాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ హాజరయ్యారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో హీరో హీరోయిన్లు రామ్, రీతూ వర్మలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్, రీతూ అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar), ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
షాపింగ్ మాల్‌ను ప్రారంభోత్సవంలో.. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ హైదరాబాద్‌కు తీసిపోని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఖమ్మం నగరంలో భారీ షాపింగ్‌మాల్ (CMR Shopping Mall) నిర్మించడం ఎంతో అభినందనీయమన్నారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సినీ హీరో రామ్ (Hero Ram), హీరోయిన్ రీతూ వర్మ షాపింగ్ మాల్ యొక్క ప్రత్యేకతను ప్రజలకు చాటి చెప్పారు. హీరో రామ్ మాట్లాడుతూ.. నాణ్యత, ప్రమాణాలతో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద షో రూముల్లో సీఎంఆర్ ఒకటని కొనియాడారు.
రీతూ వర్మ (Ritu Varma) మాట్లాడుతూ.. సీఎంఆర్ షాపింగ్ మాల్ బంగారం ఆభరణాలకు ప్రసిద్ది గాంచిందని, తాను ఈ షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నానని తెలిపారు. బంగారంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కస్టమర్లకు అందుబాటులో ఉండే రేట్లు ఈ షాపింగ్ మాల్ అందిస్తుందని అన్నారు.