The Warrior Pre Release Event: 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన హీరో రామ్ (Ram Pothineni)..!

Published on Jul 11, 2022 09:13 PM IST

The Warrior Pre Release Event: హీరో రామ్ నటిస్తున్న 'ది వారియర్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత  శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 

'ది వారియర్' (The Warrior) నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు బాగా పెంచేశాయి. ఇక ఈ చిత్రం జూలై 14న రాబోతోన్న సందర్భంగా ఆదివారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ స్టార్ కాస్ట్ తో పాటు, దర్శకుడు హరీశ్ శంకర్, తిరుమల కిషోర్ కూడా గెస్ట్ గా హాజరయ్యారు. 

అయితే ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యాన్స్ తనపై చూపించిన అభిమానానికి ఎప్పటికి ఋణపడి ఉంటానని కంటతడి పెట్టుకున్నారు. "లింగుస్వామి చెప్పిన కథ విన్నాక పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలనిపించింది. ఈ కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు.. నాకు నేర్చుకోవాలనిపించింది. ఎందుకంటే .. జీవితంలో మన కంట్రోల్ లో ఉన్న పనులు మనం చేస్తాం.. మన కంట్రోల్ లో లేనివి దేవుడికి వదిలేస్తాం.. కానీ మన కంట్రోల్ లో లేవనుకొని కొన్ని వదిలేస్తాం.. అసలు లైఫ్ లో ఒకటి సాధించాలంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు అనిపించింది. వీరందరి స్టోరీస్ విన్నాకా.. వాళ్ళ స్టోరీస్ అన్ని కలిపితే సత్య స్టోరీ వచ్చింది. లింగుసామి (Director Lingusamy) సర్ హ్యాట్సాఫ్ ఇలాంటి కథ రాసినందుకు" అని పేర్కొన్నారు. 

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్న సందర్భంగా రామ్ పోతినేని (Ram Pothineni) అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో యాంకర్ సుమ చేత అభిమానులు రామ్ పెళ్లిపై మరోసారి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రామ్ పోతినేని ‘కొన్నింటికి మాటలు ఉండవు’ అని బదులిచ్చారు. మొత్తంగా పెళ్లి ప్రస్థావనే వద్దంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Read More: ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ వ‌ల్లే 'ఇస్మార్ట్ శంక‌ర్' సాధ్య‌మైంది - రామ్ పోతినేని (Ram Pothineni)