Karthikeya 2: నిఖిల్ హీరోగా నటిస్తున్న 'కార్తికేయ 2'కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే రూ.6లక్షలు నజరానా!

Updated on Aug 02, 2022 12:42 PM IST
తాజాగా 'కార్తికేయ 2' (Karthikeya 2) మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనికోసం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.
తాజాగా 'కార్తికేయ 2' (Karthikeya 2) మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనికోసం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న కార్తికేయ 2 (Karthikeya 2) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'కార్తికేయ'కి సీక్వెల్ గా వస్తున్న 'కార్తికేయ‌ 2' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

'కార్తికేయ 2' సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీ.జీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. 

కాగా, ఇటీవలే ఈ మూవీ సెన్సార్ (Karthikeya2 sensor) పనులు కూడా ముగిశాయి. ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీన్స్, కాన్సెప్ట్  చూసి ప్రశంసల వర్షం కురిపించారు సెన్సార్ బోర్డు సభ్యులు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 12న రిలీజ్ అవ్వటానికి సిద్ధమవుతోంది.  ఇక, ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా 'కార్తికేయ 2' (Karthikeya 2) మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనికోసం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ మిస్టారికల్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల విలువ గల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. 

ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి క్లూ (Karthikeya Contest Clue) విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!