టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

Updated on Nov 14, 2022 04:27 PM IST
షూటింగ్ సమయంలో నాగశౌర్య (Naga Shaurya) అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది
షూటింగ్ సమయంలో నాగశౌర్య (Naga Shaurya) అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) అస్వస్థతకు గురయ్యారు. తాను నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నాగశౌర్య సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది. దీంతో ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నాగశౌర్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా.. హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనూష (Anusha) అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 11.25 గంటలకు వీరి వివాహం జరగనుంది. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఇందుకు వేదిక కానుంది. కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం.

షూటింగ్ సమయంలో నాగశౌర్య (Naga Shaurya) అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది

ఇకపోతే, నాగశౌర్యకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘కళ్యాణ వైభోగమే’, ‘జ్యో అచ్యుతానంద’, ‘ఛలో’ లాంటి సినిమాలో యువతలో ఆయన మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్య నాగశౌర్యకు సరైన హిట్స్ రాలేదు. ఆయన గత సినిమాలు ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పెద్దగా ఆడలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగశౌర్య కసిమీద ఉన్నారు. 

తాజాగా మరో కొత్త మూవీని ప్రకటించారు నాగశౌర్య. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించబోతున్నారు. ఆయనే కథ కూడా అందిస్తున్నారు. ‘ఎన్ఎస్ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ మూవీని వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాస్ రావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్నారు. 

Read more: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్ సెట్ చేస్తారు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!