వింటేజ్ స్టైలిష్ లుక్ లో 'సమ్మతమే' (Sammathame) హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఫొటోలు వైరల్!

Published on Aug 30, 2022 11:40 AM IST

టాలీవుడ్ లో లేటెస్ట్ షైనింగ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన నటుడు. కుర్ర హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇండస్ట్రీలో ఫ్యామిలీ బాగ్రౌండ్ లేకపోయినా తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. 

'రాజా వారు రాణి గారు' (Raja varu Rani Garu) మొదలైన కిరణ్ అబ్బవరం ప్రయాణం దేదీప్యమానంగా సాగిపోతోంది. యూత్ ని అట్రాక్ట్ చేసే కథలతో మరింత దగ్గరవుతున్నారు. అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సాధించుకున్న ఈ కుర్ర హీరో చిచ్చర పిడుగులా దూసుకుపోతున్నాడు. ఇప్పడిప్పుడే అగ్ర నిర్మాణ సంస్థల్లో సైతం అవకాశాలు అందుకుంటున్నాడు.

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన రెండవ సినిమా ఎస్.ఆర్. కళ్యాణ మండపం సినిమాతో ఒక రచయిత గా కూడా మంచి మార్కులు సాధించాడు. ఇక, ఇటీవలే 'సమ్మతమే' (Sammathame) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే సినిమాను చేస్తున్నాడు.

అయితే ఈ యంగ్ హీరో నార్మల్ లుక్స్ తో డీసెంట్ గా కనిపించేవాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కొత్త లుక్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. కళ్లద్దాలు.. సూట్ లో సరికొత్త స్టైలిష్ లుక్ తో (Kiran Abbavaram Stylish Look) ఆకట్టుకుంటున్నాడు. పక్కనే ఓల్డ్ అంబాసిడర్  కార్ నుంచి వస్తున్న పొగలు కంప్లీట్ బ్లాక్ లో షూట్ చేసిన వింటేజ్ లుక్ ఆద్యంతం ఈ హీరోని హైలైట్ చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read More: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'.. ఆకట్టుకుంటున్న టీజర్!