హీరో కార్తికేయ (Kartikeya) తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012).. ఇంటెన్సివ్ గా ప్రీ లుక్ పోస్టర్!

Updated on Nov 29, 2022 10:57 AM IST
‘బెదురులంక 2012’ (Bedurulanka2012) ప్రీలుక్‌ పోస్టర్‌ లో కార్తికేయ కేవలం తన రెండు చేతులను మాత్రమే చూపించాడు.
‘బెదురులంక 2012’ (Bedurulanka2012) ప్రీలుక్‌ పోస్టర్‌ లో కార్తికేయ కేవలం తన రెండు చేతులను మాత్రమే చూపించాడు.

'ఆర్‌ఎక్స్ 100' (RX100) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు టాలీవుడ్ యంగ్ హీరో నటుడు కార్తికేయ (Kartikeya). కమర్షియల్‌గా ఇప్పటి వరకూ అతని సినిమాలు భారీ సక్సెస్‌ అందుకోకపోయినా.. కార్తికేయ మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పల్లెటూరి నేపథ్యంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ బర్త్ డే (సెప్టెంబర్ 29) రోజు ఈ సినిమా టైటిల్‌ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను (Bedurulanka 2012 Pre Look Poster) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్.

బెదురులంక 2012’ (Bedurulanka2012) ప్రీలుక్‌ పోస్టర్‌ లో కార్తికేయ కేవలం తన రెండు చేతులను మాత్రమే చూపించాడు. ఒక చేతిలో సిగరెట్‌ పట్టుకోగా.. మరో చేతిపై ఉన్న పచ్చబొట్టును చూపించాడు. ఈ పచ్చబొట్టులో రివైండ్‌, ఫార్వర్డ్‌, పాజ్‌, ప్లే బటన్‌లు ఉండటం విశేషం. ఈ సినిమాలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

‘ఆపడం లేదు.. బిగ్గరగా ప్లే చేద్దాం..’ అనే క్యాప్షన్ తో విడుదలైన పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సీ యువరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని క్లాక్స్ డైరెక్ట్‌ చేస్తున్నాడు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ (Hero Kartikeya) పాత్ర తో పాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన పాటలందించగా, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషం.

Read More: విభిన్న కథాంశంతో కార్తికేయ (Karthikeya)-నేహా శెట్టి (Neha Shetty) జంటగా 'బెదురులంక 2012'.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!