విభిన్న కథాంశంతో కార్తికేయ (Karthikeya)-నేహా శెట్టి (Neha Shetty) జంటగా 'బెదురులంక 2012'.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Sep 21, 2022 08:53 PM IST
'బెదురులంక 2012' (Bedurulanka 2012) సినిమా ఆంధ్రప్రదేశ్ లోని లంక గ్రామం నేపథ్యంలో సాగే ఓ విభిన్న కథతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
'బెదురులంక 2012' (Bedurulanka 2012) సినిమా ఆంధ్రప్రదేశ్ లోని లంక గ్రామం నేపథ్యంలో సాగే ఓ విభిన్న కథతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ (Hero Karthikeya), 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది మూవీ యూనిట్. నేడు(సెప్టెంబర్ 21న) కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. 

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి.యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

'బెదురులంక 2012' (Bedurulanka 2012) సినిమా ఆంధ్రప్రదేశ్ లోని లంక గ్రామం నేపథ్యంలో సాగే ఓ విభిన్న కథతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. టైటిల్ లోని '2012'లో '0' లోపల '12/2012' అని రాసుంది. దట్టమైన మేఘాలు, గ్రామాన్ని ముంచెత్తేలా నీళ్ల అలజడి, ఆకాశంలో గద్ద.. ఇవన్నీ చూస్తుంటే 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు అనిపిస్తోంది. 

యుగాంతం వార్తల నేపథ్యంలో ఆ లంక గ్రామంలోని ప్రజలు ఎలా భయంభయంగా బతికారోనన్న పాయింట్ తో కథనం ఆసక్తికరంగా సాగనుందని, అందుకే ఈ సినిమాకు 'బెదురులంక 2012' (Bedurulanka 2012) అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ ఈ చిత్రంతో హిట్ అందుకుంటాడేమో చూడాలి. 

'బెదురులంక 2012' (Bedurulanka 2012) సినిమా టైటిల్ ప్రకటన సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది అని పేర్కొన్నారు.

ఇక, ఈ సినిమా దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ (Hero Karthikeya) కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు" అని పేర్కొన్నారు. 

Read More: 'ఆకాశంలో జరిగే యుద్ధాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి'.. వరుణ్ తేజ్ (Varun Tej13) కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!