DJ Tillu Sequel: 'డీజే టిల్లు' సీక్వెల్ కు దర్శకుడు మారాడు.. కొత్త డైరెక్టర్ మల్లిక్ రామ్ (Mallik Ram)?

Updated on Jul 27, 2022 08:48 PM IST
తాజాగా సీక్వెల్‌కు (DJ Tillu Sequel) సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
తాజాగా సీక్వెల్‌కు (DJ Tillu Sequel) సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహాశెట్టి(Neha shetty) జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ (DJ Tillu). సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ చిత్రం తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి మంచి హిట్టునందించింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టరనే చెప్పావచ్చు. అలాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ విమల్ కృష్ణ. 

డైరెక్టర్ విమల్ కృష్ణ (Vimal Krishna) ఈ సినిమాను యూత్ కు చేరువయ్యేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. మరి అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది అని నిర్మాతలు ప్రకటించారు.కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను విమల్ కృష్ణ ఈసారి డైరెక్ట్ చేయడం లేదట. సృజ‌నాత్మ‌క విభేదాల కార‌ణంగా విమ‌ల్ కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు గాసిప్స్ ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా సీక్వెల్‌కు (DJ Tillu Sequel) సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘డీజే టిల్లు 2’ చిత్రానికి ‘అద్భుతం’ ఫేమ్ మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తాడని టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన అద్భుతం మూవీ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. టైమ్ లూప్ కథాంశంగా తెరక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మల్లిక్ రామ్‌కు ‘డీజే టిల్లు 2’ (Dj Tillu 2) చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత అప్పగించారని సమాచారం. 

స్వాతంత్య్ర దినోత్స‌వం (ఆగస్టు 15) త‌ర్వాత ‘డీజే టిల్లు 2’ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే ఆల‌స్య‌మని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తొలి భాగం తెర‌కెక్కించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) తో క‌లిసి సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌నుంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్ స‌మాచారం. రామ్ మిరియాలా, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించనున్న‌ట్టు టాక్‌..మేక‌ర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Read More: RRR Movie: ఆ విష‌యంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను మించిపోయిన డీజే టిల్లు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!