నాగ చైతన్య (Naga Chaitanya) 'NC 22' నుంచి బిగ్ అప్డేట్స్ .. ప్రియమణి సహా భారీ తారాగణం.. అధికారిక ప్రకటన!

Updated on Oct 15, 2022 03:41 PM IST
"NC22" మూవీ ప్రస్తుతం క‌ర్ణాట‌క‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
"NC22" మూవీ ప్రస్తుతం క‌ర్ణాట‌క‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

అక్కినేని నటవారసుడు నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. "NC22" వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ 'బంగార్రాజు' మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాలో ఈ జంటకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉంటే.. "NC22" మూవీ ప్రస్తుతం క‌ర్ణాట‌క‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతాన్ని సమకూరుస్తుండటం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా "NC22" చిత్రబృందం వరుసగా బిగ్‌ అప్‌డేట్స్ ను ప్రకటించింది. మొదటగా ప్రముఖ నటి ప్రియమణి (Priyamani) కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేయగా దీని తర్వాత మరి వెర్సటైల్ నటుడు సంపత్ రాజ్ (Sampath Raj), అలాగే తమిళ్ లో మంచి ఫేమ్ ఉన్న నటుడు ప్రేమ్ జీ, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, అరవింద్ స్వామి లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అయితే ఆహ్వానించారు. 

అలాగే, ఈ చిత్రంలో తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ హిట్ సీరియల్ కార్తీక దీపంలో 'వంటలక్క'గా పేరుగాంచిన ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath) నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. టాలీవుడ్ లో ఇదే తనకి ఫస్ట్ సినిమా కావడం మరింత విశేషం. ఈ మేరకు ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, ప్రేమి విశ్వనాథ్ పోస్టర్‌లను కూడా రిలీజ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More: Naga Chaitanya: నెపోటిజంపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!