HIT 2: 'హిట్ 2' రిలీజ్ తేదీ ఫిక్స్.. అడ‌వి శేష్ (Adivi Sesh) కొత్త లుక్‌లో అదుర్స్

Updated on Sep 15, 2022 07:20 PM IST
HIT 2: 'హిట్ 2' సినిమాలో అడివి శేష్‌ (Adivi Sesh) కు జోడిగా మీనాక్షి చౌదరి న‌టిస్తున్నారు.
HIT 2: 'హిట్ 2' సినిమాలో అడివి శేష్‌ (Adivi Sesh) కు జోడిగా మీనాక్షి చౌదరి న‌టిస్తున్నారు.

HIT 2: టాలీవుడ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) 'మేజ‌ర్' సినిమా త‌రువాత 'హిట్ 2' లో న‌టిస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని త‌న సొంత బ్యాన‌ర్‌లో నిర్మించిన 'హిట్' సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2' తెర‌కెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 'హిట్' సినిమాలో హీరోగా విశ్వ‌క్ సేన్ న‌టించారు. 'హిట్' సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించింది. ఈ నేప‌థ్యంలో 'హిట్' సినిమాకు సీక్వెల్స్ తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. 

రిలీజ్ ఎప్పుడంటే..
'హిట్ 2' సినిమాలో అడివి శేష్‌  (Adivi Sesh) కు జోడిగా మీనాక్షి చౌదరి న‌టిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 2 తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. అడివి శేష్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని న్యాచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పిస్తున్నారు.

'హిట్ 2'  (HIT 2) సినిమా నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో రావు రమేశ్‌, భాను చంద‌ర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లీ ప్రసాద్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'హిట్ ది సెకండ్ కేస్' చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు. పోస్ట‌ర్‌లో అడ‌వి శేష్ లుక్ కొత్త‌గా క‌నిపించింది. ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా 'మేజ‌ర్‌'తో అడ‌వి శేష్ (Adivi Sesh) బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించారు. 26/11 ముంబై ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 

Read More: ‘హిట్‌’ సీక్వెల్‌లో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ఫ్యాన్స్‌ను సర్‌‌ప్రైజ్ చేయనున్నాడా?

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!