‘హిట్‌ 2’ (HIT 2) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో అదరగొట్టిన అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి

Published on Nov 24, 2022 12:10 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ (Adivi Sesh), మీనాక్షి చౌదరి హీరో,హీరోయిన్లుగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హిట్‌ 2’ (HIT 2). డిసెంబర్ 2న రాబోతోన్న ఈ మూవీపై మరింతగా అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైంది. ఈవెంట్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, హీరో అడివి శేష్ పాల్గొన్నారు.  

ఈ సినిమా ట్రైలర్ విడుదల (HIT 2 Trailer Launch Event) కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘హిట్ సిరీస్ లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’ లోనూ నేను ఉన్నాను. ‘హిట్ 2’ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ఉత్తరాది ప్రేక్షకులు అడుగుతున్నారు. నానీ (Hero Nani) గారితో మాట్లాడి పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అన్నపూర్ణ బ్యానర్ లో నేను చేయబోతున్న రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి. హిట్ 2 హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా విడుదలవుంది అన్నారు. 

ఇదిలా ఉంటే.. ‘హిట్‌ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో (HIT 2 Trailer Launch Event) హీరోయిన్ మీనాక్షి చౌదరి డార్క్ బ్లూ డ్రెస్‌లో మెరిసిపోయింది. బ్లాక్‌ డ్రెస్‌పై గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ, దానికి మ్యాచింగ్‌ యాక్సెసరీస్‌, స్మైల్‌తో ఆమె చాలా క్యూట్‌గా కనిపించింది. అటు అడివి శేష్‌ కూడా ఆమెకు మ్యాచింగ్‌ డ్రెస్‌లో ఈ ఈవెంట్‌కు వచ్చాడు. డార్క్‌ బ్లూ టీషర్ట్‌, పైన జాకెట్‌తో కనిపించాడు. ఈ ఇద్దరు డాషింగ్‌ లుక్‌లో ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు.

Read More: యూట్యూబ్ నుంచి ‘హిట్ 2’ టీజర్ (HIT 2 Teaser) డిలీట్ చేసిన యాజమాన్యం.. క్లారిటీ ఇచ్చిన అడివి శేష్(Adivi Sesh)!