త్వరలో సెట్స్‌పైకి అడివి శేష్‌ (Adivi Sesh) హిట్‌2 సినిమా ఫైనల్‌ షెడ్యూల్ షూటింగ్..పిక్ రిలీజ్ చేసిన యంగ్ హీరో

Updated on Jul 24, 2022 06:23 PM IST
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న హిట్‌ సీక్వెల్‌ హిట్‌2 సినిమా పోస్టర్
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న హిట్‌ సీక్వెల్‌ హిట్‌2 సినిమా పోస్టర్

మేజర్ సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయారు అడివి శేష్ (Adivi Sesh). కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలనే సెలక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతం, పంజా, బలుపు, రన్‌ రాజా రన్ సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదించారు శేష్. బాహుబలి సినిమాలో క్యారెక్టర్‌‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

మేజర్ సినిమా తెచ్చిన క్రేజ్‌తో మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్నారు అడివి శేష్. ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ సినిమాలో మేజర్‌‌ క్యారెక్టర్‌‌ను పోషించారు శేష్. ప్రస్తుతం హిట్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న హిట్‌2 సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. మేజర్ సినిమా ప్రమోషన్స్‌తోపాటు ప్రీమియర్ల పనుల్లో బిజీగా ఉండడంతో హిట్‌2 సినిమా షూటింగ్‌ లేట్ అయ్యింది.  

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న హిట్‌2 సినిమా పోస్టర్

వచ్చే నెలలో..

హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న హిట్‌2 సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజాగా అడివి శేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హిట్‌-2’ ఫైన‌ల్ షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుందంటూ.. ఓ ఫోటో విడుద‌ల చేశారు. ఈ ఫోటోలో శేష్ చేతిలో గ‌న్ పట్టుకుని ఇంటెన్సివ్‌గా చూస్తున్నారు. హిట్‌2 సినిమాలో అడివి శేష్‌ సరసన ఖిలాడీ సినిమాలో నటించిన బ్యూటీ మీనాక్షి చౌద‌రి న‌టిస్తున్నారు.

వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై నేచురల్ స్టార్ నాని, ప్రశాంత్ తిపిర్నేని సంయుక్తంగా హిట్‌2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు అడివి శేష్ ‘గూఢచారి-2’ సినిమా కూడా సెట్స్‌పై ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది. ఇటీవ‌లే గూఢచారి సినిమా సీక్వెల్‌ గూఢచారి2లో కీల‌క‌పాత్ర కోసం సూప‌ర్ స్టార్ కృష్ణను సంప్రదించామని.. అయితే ఆయన నటించడానికి నో చెప్పారని అడివి శేష్ (Adivi Sesh) తెలిపారు.

Read More : ట్విటర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar).. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!