ట్విటర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar).. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో

Updated on Jul 24, 2022 04:55 PM IST
ట్విటర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేసినట్టు వీడియో రిలీజ్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)
ట్విటర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేసినట్టు వీడియో రిలీజ్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)

ప్రేమకావాలి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). యాక్టింగ్‌తోపాటు అదిరిపోయే డైలాగ్స్‌తో కోట్ల మంది ఫాలోవ‌ర్లను సంపాదించుకున్నారు సీనియర్‌‌ హీరో సాయికుమార్. ఆయ‌న న‌ట వార‌సత్వాన్ని కొన‌సాగించేందుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆది. అప్పటి నుంచి సినిమా విజయం, అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు యువ హీరో. 

ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా కాలం త‌ర్వాత సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేసినట్టు వెల్లడించారు ఆది. హాయ్..ఫైన‌ల్‌గా ట్విట‌ర్‌లోకి వ‌చ్చాను. నా సినిమా అప్ డేట్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఎప్పుడూ న‌న్ను ఎంక‌రేజ్ చేస్తారు.. ఆద‌రిస్తారు..అలాగే ఎంక‌రేజ్ చేయాల‌ని, ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా.. నా ట్విట‌ర్ అకౌంట్‌ @iamaadisaikumar. ఛీర్స్ గాయ్స్..అంటూ వీడియో పోస్ట్ చేశారు ఆది సాయికుమార్.

ప్రస్తుతం తెలుగు, త‌మిళ ప్రాజెక్టు ‘జంగిల్‌’ సినిమాలో న‌టిస్తున్నారు ఆది సాయికుమార్. దీంతోపాటు కిరాత‌క‌, సీఎస్ఐ స‌నాత‌న్‌, క్రేజీ ఫెలో, టాప్ గేర్, తీస్‌మార్‌‌ ఖాన్, Amaran in the City: Chapter 1   సినిమాలు ఆది సాయికుమార్ చేతిలో ఉన్నాయి. ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా తెరకెక్కిన క్రేజీ ఫెలో ఫస్ట్‌ లుక్, తీస్‌మార్‌‌ఖాన్ టీజర్‌‌ ఇటీవల రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Read More : ఇండస్ట్రీ స్టామినాను పెంచిన పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) టాప్‌ సినిమాలు.. మీకోసం ప్రత్యేకం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!