నాది లవ్ ఫెయిల్యూర్‌‌.. కానీ ఎఫైర్లు లేవు: మేజర్ హీరో అడివి శేష్ (Adivi Sesh)

Updated on Jun 19, 2022 09:30 PM IST
అడివి శేష్ (Adivi Sesh)
అడివి శేష్ (Adivi Sesh)

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) సందీప్‌ రోల్‌ పోషించిన ఈ సినిమాకి శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మేజర్ సినిమా. విడుదలైన అన్ని సెంటర్లలోనూ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని పొగుడుతున్నారు. ఇక, యంగ్ హీరో అడివి శేష్‌ ప్రస్తుతం మేజర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్‌పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు.

'పెళ్లి చేసుకోమని ఇంట్లో అడగడం లేదా’ అని అడివి శేష్‌ను యాంకర్‌ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా 'పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒకటే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారీ ఇండస్ట్రీలో సల్మాన్‌ ఖాన్‌ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను' అని చెప్పాడు శేష్‌.

మేజర్ సినిమా పోస్టర్

బర్త్‌డే రోజే పెళ్లి..

అయితే సల్మాన్‌ఖాన్‌ లాగా తనకు లవ్ ఎఫైర్స్‌ లేవని చెప్పాడు శేష్. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నాను. నా పుట్టినరోజు నాడే నేను లవ్ చేసిన అమ్మాయికి పెళ్లి జరిగింది. మా తెలుగు వాడు హిందీ ఇండస్ట్రీకి వెళ్లి విజయం సాధించాడని అందరూ అంటూ ఉంటే గర్వంగా ఉంది. సక్సెస్ ఓవర్‌‌నైట్‌లో రాలేదు. అది పది సంవత్సరాల కష్టం.

చిరంజీవి, మహేష్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో.. అలాగే నేను సందీప్‌ ఉన్నికృష్ణన్‌కు అభిమానిని. ఎక్కడైనా చెడు జరుగుతోంది అంటే ఆ చుట్టుపక్కల నేను కనిపించను. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. నాకు నచ్చినదానిని ఎక్కువగా చేస్తుంటాను. ఒక్కసారి తగిలించుకుంటే వదిలించుకోవడం చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు అడివి శేష్ (Adivi Sesh).

Read More : ఒక్క సీన్‌లో అయినా వైట్‌ షర్ట్‌తో చిరు.. రిలీజ్‌కు ముందు దర్గాకు మహేష్‌..టాలీవుడ్ (Tollywood) తారల సెంటిమెంట్స్ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!