Major : ఓటీటీలోకి అడివి శేష్‌ హీరోగా నటించిన ‘మేజర్’? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే

Updated on Jun 30, 2022 09:50 PM IST
అడివి శేష్ (Adivi Sesh)
అడివి శేష్ (Adivi Sesh)

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా న‌టించిన సినిమా ‘మేజ‌ర్‌’ (Major). శ‌శికిర‌ణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా కొద్దిరోజుల క్రితం విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 26/11 ముంబై బాంబు దాడుల్లో అమ‌రుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

మేజ‌ర్ పాత్రలో అడివి శేష్ నటన అందరినీ అలరించింది. శేష్ న‌ట‌న‌కు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మేజర్‌‌ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర భారీ క‌లెక్షన్లు సాధించింది. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలై అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి ‘మేజ‌ర్’ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు.

అడివి శేష్ (Adivi Sesh)

30 రోజుల తర్వాతే..

థియేట‌ర్‌లో విడుద‌లైన 30 రోజుల‌ తర్వాత మేజర్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది. జీఎంబీ ఎంట‌ర్‌‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఏయ‌స్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ‘మేజర్‌‌’ సినిమాను నిర్మించాయి. అడివి శేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ న‌టించింది.

ప్రకాష్ రాజ్‌, రేవ‌తి, శోభిత ధూళిపాళ ‘మేజర్‌‌’ (Major) సినిమాలో కీల‌క పాత్రలు పోషించారు. ప్రస్తుతం అడివి శేష్.. హిట్-2, గూఢచారి 2 సినిమాల్లో నటిస్తున్నారు. హిట్‌2 సినిమా షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శరవేగంగా జ‌రుగుతున్నాయి. గూఢచారి-2 ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జరుగుతున్నాయి.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి కాంబో సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. అడ్వంచరస్ థ్రిల్లర్‌‌గా మూవీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!