‘సాహో’ దర్శకుడు సుజిత్ కథకు పవన్ (Pawan Kalyan) గ్రీన్ సిగ్నల్!.. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌లో నిజమెంత?

Updated on Nov 23, 2022 04:11 PM IST
త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan)​‌కు సుజిత్ కథ వినిపించారని తెలుస్తోంది
త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan)​‌కు సుజిత్ కథ వినిపించారని తెలుస్తోంది

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. కోట్ల రూపాయలు పెట్టి చిత్రాలను తీస్తుంటారు.. కాబట్టి నిర్మాతలు సక్సెస్‌కే ప్రాధాన్యం ఇస్తారని అర్థం చేసుకోవాలి. విజయం లేనివారిని ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇది హీరోలు, హీరోయిన్లతోపాటు డైరెక్టర్లకూ వర్తిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఒక ఫెయిల్యూర్ వస్తే వెంటనే అలర్ట్ అయ్యి.. తర్వాతి చిత్రాన్ని మరింత పకడ్బందీగా తీస్తుంటారు. పరాజయం తర్వాత మంచి అవకాశం వస్తే సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. 

యువ దర్శకుడు సుజిత్ (Sujeeth) కూడా ఇప్పుడే ఇలాంటి చాన్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ మూవీ తర్వాత ఆయన ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. హిందీలో మంచి హిట్ సాధించినప్పటికీ.. తెలుగులో మాత్రం ఈ చిత్రం నిరాశపర్చింది. దీంతో సుజిత్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సుజిత్‌కు ఓ చాన్స్ ఇచ్చారు. ఏకంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్​‌ను డైరెక్ట్ చేసే అవకాశం సుజిత్‌కు దక్కిందని సమాచారం. 

యువ దర్శకుడు సుజిత్ (Sujeeth) కూడా ఇప్పుడే ఇలాంటి చాన్స్ కోసమే ఎదురు చూస్తున్నారు

సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్​ (Pawan Kalyan) హీరోగా ఓ మూవీ చేయడానికి డీవీవీ దానయ్య రంగం సిద్ధం చేసుకున్నట్లు వినికిడి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో పవన్‌కు సుజిత్ కథ వినిపించారని.. స్టోరీ నచ్చడంతో పవర్ స్టార్ ఫైనల్ చేశారని సమాచారం. పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ పూర్తయిన తర్వాత సుజిత్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పవన్‌తో సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం సుజిత్‌కు బిగ్ చాన్స్ దక్కినట్లే.

కాగా, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ప‌వ‌న్‌ కల్యాణ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఏ ద‌యాక‌ర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీర‌వాణి సంగీతం అందిస్తున్న ‘వీరమల్లు’ చిత్రం తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ భారీ స్థాయిలో విడుద‌ల కానుంది.

Read more: HBD Anil Ravipudi: "హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి" - బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ చేయడంలో అనిల్ బెస్ట్.. అంతేగా..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!