పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకుండానే 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) యాక్షన్ సీక్వెన్స్..?

Updated on Nov 02, 2022 12:38 PM IST
'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొనడం లేదట. పవన్‌ డూప్‌తో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నారట.
'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొనడం లేదట. పవన్‌ డూప్‌తో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నారట.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో.. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. 

'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) లో పవన్ బందిపోటుగా డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 17వ శ‌‌‌‌తాబ్దం నాటి మొఘ‌‌‌‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌‌‌‌కం నేప‌‌‌‌థ్యంలో జ‌‌‌‌రిగే క‌‌‌‌థ‌‌‌‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ఎఎం రత్నం సమర్పణలో.. ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, త‌‌‌‌మిళ‌‌‌‌, కన్నడ, మ‌‌‌‌ల‌‌‌‌యాళ భాష‌‌‌‌ల్లో  "హరిహర వీరమల్లు" విడుదల కానుంది. 

'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) లో పవన్ (Pawan Kalyan) బందిపోటుగా డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని పవన్‌తో ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ క్రిష్ (Director Krrish). అంతే కాకుండా.. ఈ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా.. ఓ వార్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో దర్శకుడు క్రిష్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే ఈ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొనడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో పలు చోట్ల చక్కర్లు కొడుతోంది. పవన్‌ బిజీ షెడ్యూల్ కారణంగా.. ఆయన డూప్‌తో  క్రిష్ యాక్షన్‌ ఎపిసోడ్‌‌లోని కొంత భాగాన్ని చిత్రీకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పోరాట విన్యాసాలు చేయనున్నారని టాక్. కానీ, రాజకీయ పనులతో బిజీగా ఉన్నందున, ఆయన షూటింగ్‌‌కి చాలా తక్కువ సమయమే కేటాయిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక, ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 

Read More: 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటెన్స్ లుక్ అదిరిపోయిందిగా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!