Bedurulanka 2012: ‘వచ్చాడ్రా.. శివుడొచ్చాడ్రా’!.. ఆసక్తికరంగా కార్తికేయ ‘బెదురులంక 2012’ మోషన్ పోస్టర్ 

Updated on Nov 30, 2022 06:09 PM IST
ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రం తెరకెక్కుతోందని నిర్మాత బెన్నీ తెలిపారు 
ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రం తెరకెక్కుతోందని నిర్మాత బెన్నీ తెలిపారు 

సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. నటుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సరైన పాత్ర దొరికి, మంచి సినిమా పడాలి అప్పుడే గుర్తింపు సంపాదించొచ్చు. కానీ కొందరి విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని చెప్పొచ్చు. ఒకే చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి కేటగిరీలోకే వస్తారు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఆయన ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. 

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో కార్తికేయ (Kartikeya Gummakonda) స్టార్‌డమ్ సంపాదించారు. యువతలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయితే విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు కార్తికేయ. ఆయన యాక్ట్ చేసిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మిస్తున్నారు. 

‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కార్తికేయ లుక్ వినూత్నంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. కండలు తిరిగిన బాడీ చిరునవ్వుతో కనిపించిన కార్తికేయ లుక్ బాగుందని అందరూ అంటున్నారు. ‘వచ్చాడ్రా.. శివుడొచ్చాడ్రా’ అని బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న పాట సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పనేని మాట్లాడుతూ.. ‘బెదురులంక 2012’ విభిన్నంగా ఉండబోతోందన్నారు. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ చివరి దశకు చేరుకుందన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని బెన్నీ పేర్కొన్నారు.  

‘బెదురులంక 2012’ డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమని దర్శకుడు క్లాక్స్ చెప్పారు. ఈ సినిమాలో కొత్త కార్తికేయను చూస్తారన్నారు. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్‌తోపాటు కడుపుబ్బా నవ్వించే వినోదం కూడా ఉందన్నారు. మరి, ఈ మూవీతో కార్తికేయ ఎలాంటి హిట్‌ను అందుకుంటారో చూడాలి. 

ఇకపోతే, ‘బెదురులంక 2012’ సినిమాలో సీనియర్ నటులు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతితోపాటు కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ మూవీకి బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రానికి అంజి ఫైట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Read more: Telugu Flop Movies 2022 : 2022లో విడుదలైన టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం...

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!