Sitara Ghattamaneni: గుర్రంపై స్వారీ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని!

Sitara Ghattamaneni: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కి కొదువే లేదు. అయితే, సూపర్ స్టార్ ఫ్యామిలీలో మాత్రం పిల్లలు కాదు.. వాళ్లు కూడా జూనియర్ సూపర్ స్టార్సే అన్నట్లుగా ఉంటోంది వారి వరస. టాలీవుడ్ (Tollywood) ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు నటశేఖర కృష్ణ (Krishna). ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు కుమారుడు ప్రిన్స్ మహేష్‌బాబు (Maheshbabu). అయితే ఆయనకు కూడా ఏమాత్రం తీసిపోనంటోంది మహేష్‌బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని.
తండ్రిలోని నటనతో పాటు, ఎక్స్‌ట్రా క్వాలిటీస్ కూడా తనకున్నాయని ఇప్పటికే నిరూపించుకుంది సితార. తన తండ్రి నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో బెన్నీ సాంగ్‌తో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన ఈ లిటిల్ సూపర్ స్టార్.. ఇప్పుడు గుర్రపు స్వారీ (Horse riding) కూడా నేర్చుకుంటోంది. మహేష్‌బాబు కూతురుగానే కాకుండా సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు అన్నీ రంగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది సితార.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా సితార.. సోషల్ మీడియాలో కూడా తరచుగా యాక్టివ్ ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన సితారకు.. 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మనం కూడా, ఈ సూపర్ స్టార్ తనయ క్రేజ్ ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. తన తాతయ్య కృష్ణ (Super Star Krishna) కౌబాయ్ గా, తండ్రి టక్కరి దొంగగా కనిపిస్తే.. సితార కూడా అదే స్టైల్లో గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. అయితే, సితార హార్స్ రైడింగ్ వీడియో చూస్తుంటే.. ఇది కూడా సినిమా యాక్టింగ్ కోసమే అనుకోనవసరం లేదనిపిస్తోంది. ఓ ప్రొఫెషనల్ హార్స్ రైడర్‌లా ఆమె తర్ఫీదు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అంతే కాదు.. తన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సితార (Sitara Ghattamaneni) 'టిల్‌బెర్రీ, బెర్టా అనే రెండు అందమైన శక్తివంతమైన దయకలిగిన గుర్రాలపై.. నాకు స్వారీ నేర్పిస్తున్న గురువులకు థ్యాంక్స్' అని చెప్పింది. తన హార్స్ రైడింగ్ ఎక్స్‌పీయరెన్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునేందుకు ఈ వీడియోని అప్‌లోడ్ చేసింది సితార.
కాగా, సితార పాప టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ మధ్య ఉగాది పండుగ సందర్భంగా ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అయింది. అలాగే ఆమె అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత సర్కారు వారి పాట (Sarkaruvaari Paata) సినిమాలోని బెన్నీ సాంగ్ ప్రమోషన్ కోసం సితార అదిరిపోయే స్టెప్పులు వేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది.
ఇప్పుడు ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ.. తనలో కూడా తాత, తండ్రి చేసిన యాక్షన్ పాత్ర తాలూకు షేడ్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకుంటోంది లిటిల్ సూపర్ స్టార్ సితార షేర్ చేసిన ఈ గుర్రపు స్వారీ వీడియోలో అన్న గౌతమ్ కూడా ఉన్నాడు. కాగా, గౌతమ్ కూడా 'వన్ నేనొక్కడినే' సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన సంగతి తెలిసిందే.
Read More: మురారి పాటతో థియేటర్లను షేక్ చేయనున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)
